Breaking News

బాసట్‌.. చెరకు రసానికి బాసట!

Published on Fri, 02/28/2025 - 04:29

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వేసవి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో, శివారు ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన అనేకచోట్ల చెరకు రసం (కేన్‌ జ్యూస్‌) బండ్లు కనిపిస్తుంటాయి. చెరకు రసాన్ని ఇష్టంగా తాగేవారు చాలామందే ఉంటారు. చెరకు నుంచి చక్కెర, బెల్లం తయారు చేస్తారనేది అందరికీ తెలిసిందే. అయితే రసం కోసం ఓ ప్రత్యేకమైన చెరకు పంట ఉంది. అదే ‘బాసట్‌’. చెరకును సాగు చేసే సంగారెడ్డి జిల్లా రైతులు.. స్థానికంగా ‘బాసట్‌’ పేరుతో 62175 చెరకు రకాన్ని సాగు చేస్తున్నారు. 

ఈ చెరకు తెల్ల రంగులో ఉండటంతో పాటు, ఇందులోంచి రసం (జ్యాస్‌) ఎక్కువగా వస్తుంది. అలాగే ఈ చెరకుకు పూత ఉండదు. దీంతో జ్యూస్‌ ఎంతో రుచికరంగా ఉంటుంది. సాధారణంగా చక్కెర కర్మాగారాలకు తరలించే చెరుకులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కానీ ఈ రకంలో జ్యూస్‌ ఎక్కువగా వస్తుంది.

సుమారు రెండు వేల ఎకరాల్లో..
ఈ ప్రత్యేక వెరైటీ చెరకును సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ డివిజన్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. సుమారు రెండు వేల ఎకరాల్లో ఈ ప్రత్యేక రకం సాగ వుతోంది. జహీరాబాద్‌ మండలంతో పాటు, ఝరా సంఘం, మొగుడంపల్లి, కొహీర్‌ మండలాల పరిధి లో ఈ బాసట్‌ రకం ఎక్కువగా సాగవుతోంది. ఏటా ఫిబ్రవరి నుంచే వ్యాపారులు ఇక్కడికి వచ్చి రైతుల వద్ద చెరకును కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు.

ఎండలు ముదిరితే డిమాండ్‌
ఎండల తీవ్రత ఎక్కువైతే ఈ చెరకుకు డిమాండ్‌ మరింత పెరుగుతుంది. ఎందుకంటే వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ఎక్కువమంది చెరుకు రసం తాగుతుంటారు. దీంతో ఏప్రిల్, మే మాసాల్లో టన్ను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలుకుతుంది. ఒకవేళ మే లోనే వర్షాలు ప్రారంభమైతే ధరను తగ్గిస్తుంటారు. సాధారణంగా టన్ను రూ.3 వేల వరకు ఉంటుంది.

రెండేళ్లుగా సాగు చేస్తున్నా..
గత రెండు సంవత్సరాలుగా ఈ బాసట్‌ చెరకు పండిస్తున్నా. పది నెలల్లో పంట చేతికందుతుంది. ఇటీవలే పంట నరికి రెండురోజుల క్రితం హైదరాబాద్‌కు సరఫరా చేశా. టన్నుకు రూ.3 వేల చొప్పున రేటు వచ్చింది. ఎండాకాలం వస్తే చెరకు రసానికి డిమాండ్‌ పెరుగుతుంది. దీంతో బాసట్‌ చెరకును ఎక్కువగా తీసుకెళుతుంటారు. ఫ్యాక్టరీ చెరకు సాగు కంటే ఇది కొంత మేలే. – తెనుగు శేఖర్, చెరకు రైతు, ఈదుల్‌పల్లి, సంగారెడ్డి జిల్లా

రసం వస్తుందనే వ్యాపారులు కొంటారు..
రెండు ఎకరాల్లో బాసట్‌ రకం వేశా. హైదరాబాద్‌ నుంచి వ్యాపారులు వచ్చి ఈ చెరకును కొనుగోలు చేస్తుంటారు. ఎండాకాలం వస్తే డిమాండ్‌ పెరుగుతుంది. రసం బాగా వస్తుందనే ఈ రకాన్ని ఎక్కువగా తీసుకెళుతుంటారు. – మొగులప్ప, చెరకు రైతు,రాయికోడ్, సంగారెడ్డి జిల్లా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)