Breaking News

సుదీర్‌బాబు పునరాగమనం

Published on Thu, 07/11/2024 - 07:56

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన కోడ్‌ ఎఫెక్ట్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో బదిలీ అయిన రాచకొండ పోలీసు కమిషనర్‌ జి.సుధీర్‌బాబు తిరిగి అదే స్థానానికి వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో ఆయనను మల్టీ జోన్‌–2 ఐజీగా బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న తరుణ్‌ జోషిని రాచకొండ సీపీగా తీసుకువచి్చంది. తాజా బదిలీల్లో తరుణ్‌ జోషి ఏసీబీ డైరెక్టర్‌గా వెళ్లారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కీలక స్థానాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరిలో మార్గదర్శకాల జారీ చేసింది. వీటి ప్రకారం ఈ ఏడాది జూన్‌ 30ని గడువుగా తీసుకుని.. ఆ తేదీ నుంచి వెనక్కు నాలుగేళ్ల కాలంలో వరుసగా మూడేళ్లు ఓ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తే బదిలీ తప్పనిసరి.  

⇒ సుదీర్‌బాబు 2018 ఏప్రిల్‌ నుంచి 2023 జనవరి వరకు రాచకొండ కమిషనరేట్‌లో సంయుక్త, అదనపు సీపీగా విధులు నిర్వర్తించారు. డీఐజీ హోదాలో సంయుక్త సీపీగా అక్కడ రిపోర్ట్‌ చేసిన ఆయన ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కొనసాగుతూ అదనపు సీపీగా పని చేశారు. ఆపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం అదనపు సీపీగా బదిలీపై వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత గతేడా ది డిసెంబర్‌ 13న రాచకొండ పోలీసు కమిషనర్‌గా వెళ్లారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం 2020 జూలై 1 నుంచి ఒకే కమిషనరేట్‌లో మూడేళ్లు పని చేసిన జాబితాలో సు«దీర్‌ బాబు ఉన్నారు. దీంతో ఆయ న్ను బదిలీ చేసిన ప్రభుత్వం తరుణ్‌ జోషిని నియమించింది. తాజా బదిలీల్లో సు«దీర్‌ బాబును మళ్లీ రాచకొండ సీపీగా నియమించింది.  

⇒ గతంలో రాచకొండ సంయుక్త సీపీగా పని చేసిన అనుభవం ఉన్న సుధీర్‌బాబు హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో కీలక పోస్టింగ్‌లతో పాటు వరంగల్‌ సీపీగానూ పని చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 17 మంది ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా నగరానికి సంబంధించిన కొన్ని స్థానాల్లోనూ మార్పుచేర్పులు జరిగాయి. వనపర్తి ఎస్పీగా పని చేస్తున్న రక్షిత కె.మూర్తి డీసీపీ సీఏఆర్‌ హెడ్‌–క్వార్టర్స్‌ డీసీపీగా వచ్చారు. దీంతో నగరంలో పని చేస్తున్న మహిళా ఉన్నతాధికారుల సంఖ్య ఆరుకు చేరింది. గతంలో సౌత్‌ వెస్ట్‌ డీసీపీగా పని చేసి, ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న బి.బాలస్వామి ఈస్ట్‌ జోన్‌గా రాగా.. రాచకొండ టాస్‌్కఫోర్స్‌ డీసీపీ జి.చంద్ర మోహన్‌ సౌత్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా వచ్చారు.

 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)