తెలుగు రాష్ట్రాలపై ‘పిడుగు’ పంజా

Published on Wed, 10/30/2024 - 20:26

అమరావతి/హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో పిడుగు పంజాతో పలువురు మరణించగా.. తీవ్రంగా గాయపడి పలువురు చికిత్స పొందుతున్నారు.

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ధనురా గ్రామం లో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. గ్రామ చెరువు దగ్గర గొర్రెలను మేపుతుండగా.. ఇద్దరిపై పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే వాళ్లు మృతి చెందారు. మరణించిన వాళ్లను బండారు బేతయ్య(48), డాకూరి భరత్ (14) బండారు బేతయ్య (48)గా గుర్తించారు.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కాల్ నాయక్ తండాలో పిడుగు పాటుకు యువకుడు కొర్ర నాగరాజు(28) మృతి చెందాడు.

హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నాం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వికారాబాద్‌ జిల్లాలోనూ భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.

ఇక ఏపీ విషయానికొస్తే..  తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని సూర్యరావు పాలెం గ్రామంలో పిడుగు పంజా విసిరింది. బాణాసంచా తయారీ కేంద్రం పిడుగుపడడం.. షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో అక్కడ పని చేసే ఇద్దరు మహిళలు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు..

తిరుమలలో కుండపోత వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దర్శనం అనంతరం వసతి గృహాలకు వెళ్లే క్రమంలోనూ భక్తులు తడిచిముద్దైయ్యారు. అలాగే.. లోతట్టు ప్రాంతాలలో వర్షపు చేరింది. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో వాహన దారులను జాగ్రత్తగా వెళ్లాలంటు సిబ్బంది సూచిస్తున్నారు. మరోవైపు చలి తీవ్రత కూడా ఎక్కవగా ఉండటంతో  భక్తులకు వెన్నులో వణుకుపుట్టిస్తోంది.

ఇక.. గుంటూరు, పల్నాడు జిల్లాలోనూ వర్షం కురిసింది. అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో ఒక్కసారిగా మారిపోయింది వాతావరణం. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. 

ఇరు రాష్ట్రాల్లోని మిగతా చోట్ల పిడుగు నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగానే నవంబర్‌ 1వ తేదీ దాకా.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)