విజయవంతంగా బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్లింగ్‌ శిక్షణ

Published on Mon, 02/17/2025 - 04:23

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం బీటెక్‌ పట్టభద్రుల కోసం ప్రారంభించిన బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ – స్కిల్లింగ్‌) కోర్సుకు మంచి స్పందన లభిస్తోంది. మొదటి, రెండో విడత బ్యాచ్‌ల శిక్షణ ఇప్పటికే పూర్తికాగా,  మూడో విడత కోర్సుల శిక్షణ కోసం ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. 

వీరిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది జూలై వరకు బ్యాంకింగ్‌ ఆపరేషన్స్, ఫైనాన్షియల్‌ మార్కెట్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్, ప్రోగ్రామింగ్, అప్లికేషన్‌ అండ్‌ డేటాబేస్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, సాఫ్ట్‌ స్కిల్స్‌ తదితర అంశాలపై యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తారు. 

ఆ తరువాత బీఎఫ్‌ఎస్‌ఐకు సంబంధించి హైదరాబాద్‌లోని గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఏటా 10 వేల మందికి శిక్షణ ఇస్తారు. వీరిలో 5 వేల మంది ఇంజనీరింగ్, మరో 5 వేల మంది డిగ్రీ పట్టభద్రులుంటారు. రానున్న మూడేళ్లలో 30 వేల మంది తెలంగాణ యువతకు ఈ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

గతేడాది సెప్టెంబర్‌లో ‘బీఎఫ్‌ఎస్‌ఐ – స్కిల్లింగ్‌’ కోర్సు ప్రారంభమైంది. ఖర్చును ఎక్విప్, బీఎఫ్‌ఎస్‌ఐ కన్సార్షియం భరిస్తుంది. విద్యార్థుల నుంచి రూ.5 వేలు వసూలు చేస్తారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న పట్టభద్రులు స్కిల్స్‌ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ yisu.in  ను సందర్శించాలని కోరారు. 

#

Tags : 1

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)