Breaking News

ఎంఎస్‌ఎంఈ పాలసీలో బీసీలకు సబ్సిడీలు

Published on Wed, 10/02/2024 - 05:31

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈ– 2024 పాల సీలో ఇతర వర్గాలకు ఇ చ్చిన మాదిరిగా బీసీల కూ ప్రయోజనాలు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో మంగళవారం సెక్రటేరియట్‌ కాన్ఫ రెన్స్‌ హాల్‌లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరా వుతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మేధావులు, రిటైర్డ్‌ ఐఎఎస్‌లు, బీసీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, పారిశ్రామిక వేత్తలతో మేథోమధన సదస్సు నిర్వహించారు. సమావేశంలో ఎంఎస్‌ఎంఈ రిటైర్డు జాతీయ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ చుక్కా కొండయ్యతో పా టు రిటైర్డు ఐఎఎస్‌లు, మేధావులు, పారిశ్రామి కవేత్తలతో కలిపి కమిటీ వేయాలని నిర్ణయించారు.

ఎంఎస్‌ఎంఈలో బీసీలకు సంబంధించిన అంశాలను చేర్చేందుకు వారి సలహా సూచనలు తీసుకొని అందులో చేర్చాల్సిన అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కేశవ రావు మాట్లాడుతూ బీసీలకు సబ్సిడీలు కల్పిస్తే వారితో పారిశ్రామికాభివృద్ధి సాధించవచ్చని సూచించారు. పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ, ఎంఎస్‌ఎంఈ పాలసీలో బీసీలకు సబ్సిడీలు ఇతర అంశాలు చేరిస్తే లక్షలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు స్వత హాగా కులవృత్తులు ఆధునిక సాంకేతికతతో ఆర్థికవృద్ధి సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు.

రాష్ట్రంలో ప్రతి బీసీ కుటుంబం ఒక సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ అని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. ఎంపీ అనిల్‌కుమార్‌ యాద వ్, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, కమిషనర్‌ బాల మాయాదేవి, రిటైర్డు ఐఎఎస్‌ లు చిరంజీవులు, చోలేటి ప్రభాకర్, దినకర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యావ్యవస్థలో సమూల మార్పులు
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో విద్యారంగ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని, బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలను ప్రతి ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు సందర్శించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభా కర్‌ కోరారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వ హించి బీసీ సంక్షేమ శాఖలో ఉన్నా సమస్యలపై చర్చించారు. బీసీ సంక్షేమ శాఖలో ఉన్న సమ స్యలపై చర్చించారు. అధికారులు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నవంబర్‌ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురు కులాలు సందర్శిస్తానని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్‌ బాల మాయా దేవి తదితరులు పాల్గొన్నారు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)