Breaking News

కీలక ఆధారాలు అతని వద్దే?

Published on Sat, 12/07/2024 - 07:29

ములుగు: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్‌ అనుమానాస్పద ఆత్మహత్యపై పలు రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న గన్‌మన్‌ అందుబాటులో లేకపోవడం  అనుమానాలకు దారితీస్తోంది. కేసును ఛేదించేందుకు వెంకటాపురం(కె) సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో వాజేడు కేంద్రంగా పూర్తి స్థాయి సమాచారం రాబట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

 ఇప్పటికే ఆత్మహత్య అనంతరం సంఘటనా స్థలం నుంచి క్లూస్‌ టీమ్‌ సభ్యులు ఎస్సై హరీశ్‌కు సంబంధించిన రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మాట్లాడిన సూర్యాపేట జిల్లా పరిధి చిలుకూరు మండలానికి చెందిన యువతి ఫోన్‌కాల్‌ లిస్టుపైన మదింపు జరుగుతున్న ట్లుగా సమాచారం. ఇదంతా పోలీసు శాఖ పరిధిలో సాఫీగానే జరుగుతున్నా.. వాజేడు ఎస్సైగా హరీశ్‌ బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి అతను ఆత్మహత్య చేసుకునే వరకు ఎస్‌ఐతో ఉన్న గన్‌మన్‌ మరుసటి రోజు నుంచి అందుబాటులో లేకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది.

సంచలనంగా మారిన ఈ కీలక కేసులో గన్‌మన్‌కు పోలీస్‌ ఉన్నతాధికారులు సెలవు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. వివాదాస్పద కేసు వివరాలను బయట పెడతాడని అధికారులు అతడిని సెలవుపై పంపించారా? లేక అతడిని కూడా విచారిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీస్‌ శాఖ తరఫున అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాకపోవడం గమనార్హం.

రాంగ్‌ కాల్‌ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్‌ఐ ఆత్మహత్య


 

 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి