Breaking News

సీక్రెట్‌ కెమెరాలపై విద్యార్థినుల ఆందోళన.. సీఎంఆర్‌ కాలేజీకి పేరెంట్స్‌

Published on Thu, 01/02/2025 - 10:55

సాక్షి, మేడ్చల్‌: మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్‌ బాత్ రూమ్‌ల్లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో, టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల ప్రకారం.. సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్‌ బాత్‌ రూమ్‌ల్లో సీక్రెట్‌ కెమెరాలు అమర్చినట్టు విద్యార్థినిలు ఆరోపించారు. రహస్యంగా వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో పని చేసే వంట సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో, వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు.

అనంతరం, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విద్యార్థినిల ఆందోళనలతో వారి పేరెంట్స్‌ కాలేజీ వద్దకు చేరుకుంటున్నారు. ఈ ఘటనపై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో, కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు