Breaking News

సార్‌.. ఈ అన్నం మాకొద్దు

Published on Tue, 11/26/2024 - 00:36

కరీంనగర్‌/జగిత్యాలటౌన్‌: మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామంటూ రెండుచోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగా రు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని పురాతన పాఠశాల వి ద్యార్థులు రోడ్డెక్కగా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరెపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి చేరుకొని కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. 

వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌లోని పురాతన పా ఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సో మవారం 217 మంది పాఠశాలకు హాజరయ్యారు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఈ పాఠశాలలో వారంరోజులుగా ఉడికీఉడకని అన్నం పెడుతున్నారని, అడుగు భాగం మెత్తగా, ముద్దగా మారి మాడిపోతోందని, ఆ అన్నం ఎలా తినేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అరగంట పాటు ఆందోళన చేసినా ఉన్నతాధికారులెవరూ పాఠశాలకు రాలేదు. దీంతో విద్యార్థులు అన్నం తినకుండానే పడేశారు.  

ఆరెపల్లి పాఠశాలలో వంట మనిషిని మార్చాలని కోరుతూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని, రుచిలేని అన్నం వడ్డిస్తున్నారని, ప్రశ్నిస్తే ఇష్టమున్నచోట చెప్పుకోమంటూ వంట మనుషులు బెదిరిస్తున్నారని ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్నారు. నాలుగు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ప్రజావాణి ఆడిటోరియంలోకి వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. వంటమనిíÙని తొలగించి సరైన భోజనం అందించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసన విరమింపజేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)