Breaking News

కుక్కలకు మీ ఇంటి వద్దే భోజనం పెట్టండి

Published on Thu, 08/08/2024 - 10:41

వెంగళరావునగర్‌: ‘వీధి కుక్కలకు మీ ఇంటి వద్దనే ఆహారాన్ని పెట్టండి మహాప్రబో.. రోడ్ల మీద పెట్టకండి.. కుక్కల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించండి’అంటూ మధురానగర్‌ కాలనీలో స్థానికులు వినూత్నరీతిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు గత ఏడాది నుంచి జరుగుతున్న కాలనీవాసుల ఆందోళనే ప్రధాన కారణం. దాదాపు ఏడాదిన్నర నుంచి కాలనీలో కుక్కల బెడద మరీ ఎక్కువగా ఉంది. 

శునకాలు పదుల సంఖ్యలో సంచరిస్తూ ఇప్పటికే 50 మందిపై దాడి చేసి గాయపర్చాయి. ఆందోళన చెందిన కాలనీవాసులు అసోసియేషన్‌కు మొర పెట్టుకున్నారు. కొందరు రోడ్ల మీదనే కుక్కలకు ఆహారాన్ని ఇవ్వడం వల్ల అవి కాలనీలో తిష్ట వేశాయని, కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసుస్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజల ఆవేదన దృష్టిలో పెట్టుకుని మధురానగర్‌కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ విధమైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 

వీధి కుక్కలను తమ ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఆహారాన్ని అందించినట్టయితే వాటికి కడుపు నిండుతుందని, కాలనీవాసులకు రక్షణ ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని అసోసియేషన్‌ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా కుక్కల ప్రేమికులు కాలనీవాసుల సమస్యను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పెంపుడు కుక్కలు వీధుల్లో మల విసర్జన చేస్తే తక్షణమే యజమానులు వాటిని తొలగించాలని కోరారు. కాలనీ వీధుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసిన ప్రజలు అసోసియేషన్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)