Breaking News

సాగుకు చుక్కనీటినీ వదలొద్దు!

Published on Thu, 07/16/2026 - 05:49

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రిజర్వాయర్లలో ఉన్న నిల్వలన్నీ కూడా తాగునీటి అవసరాలు తీర్చడానికే వినియోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టుల కింద సాగునీటిని విడుదల చేస్తామనే ప్రకటనలు అధికారులు చేయరాదని స్కీవమ్‌ (రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ..ఇది రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల నుంచి పంటలకు నీటిని విడుదల చేయడంపై తుది నిర్ణయాలు తీసుకునే అత్యున్నత అధికారిక యంత్రాంగం) ఆదేశించింది. బుధవారం ఈఎన్సీ (జనరల్‌) రమేష్‌బాబు అధ్యక్షతన కమిటీ సమావేశం జలసౌధలో జరిగింది. ఈ సమావేశంలో ఏయే ప్రాజెక్టుల్లో ఏ మేర లైవ్‌ స్టోరేజీ ఉందనే అంశంపై చర్చ జరిగింది. అయితే లైవ్‌ స్టోరే­జీ వివరాలు లేకుండా సమావేశానికి హాజరుకావడంపై కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(కాడా) అధికారు­లను ఈఎన్సీ మందలించారు. ఏ రిజర్వాయర్లో ఏమేరకు లైవ్‌ స్టోరేజీ ఉందనే వివరాలు లేకుండానే వస్తారా? ఇది పద్ధతి కా­దంటూ కాడా అధికారులపై మండిపడ్డారు. వచ్చే నెలలో మళ్లీ సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులోపు ప్రా­జెక్టులకు ఇన్‌ఫ్లోలు వస్తే సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. 

ఇక రిజర్వాయర్లో కనీస నీటిమ­ట్టం కింద చుక్కనీటిని కూడా సాగునీటి అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని ఆదేశించారు. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టం పైన 27 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 14 టీఎంసీల నిల్వలున్నాయని గుర్తించారు. ఈ నిల్వలన్నీ ప్రస్తుతా­నికి తాగునీటి అవసరాలకే వినియోగించాలని గుర్తు చేశా­రు. ప్రస్తుతానికి భూగర్భ జలాలు ఆశాజనకంగానే ఉన్నప్పటి­కీ రానున్న రోజుల్లో వానలు పడక పోతే మరింత లోతుకు నీళ్లు వెళ్లే అవ కాశాలున్నాయని, రైతాంగం ఆరుతడి పంటలు వేసుకోవాలని, వరి సాగుకు ఉపక్రమించరాదని భూగర్భజలశాఖ డైరెక్టర్‌ గుర్తు చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో అరుతడి పంటలే వేసుకోవాలని రైతులను కోరుతున్నామని వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్‌ నర్సింహారావు తెలిపారు. 

ఇక మూసీ ప్రాజెక్టు­లో నిరంతరం నిల్వలు ఉంటున్నందున ఈ ప్రాజెక్టుకింద సా­గునీటికి నీరందించాలని, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌ వరదలతో తాలిపేరు ప్రాజెక్టుకు వరద నిరంతరం వస్తుందని, ఆ ప్రాజెక్టు కింద సాగునీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించా­రు. నాగార్జునసాగర్‌ కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్‌లో 513 అడుగుల మేర నీరుందని, ఈ ప్రా­జెక్టు నుంచి ప్రతినెల 13 టీఎంసీలు తాగునీటికి అవసరం ఉంటుందని తెలిపారు. 510 అడుగుల కిందికి నిల్వలు చేరితే అత్యవసర పరిస్థితుల్లో పంపింగ్‌ కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. ఇక నిజాంసాగర్‌లో ఆశాజనకంగా­నే నిల్వలు ఉన్నప్పటికీ ఆ నిల్వలను సాగునీటికి ఇవ్వొద్దని గు­ర్తుచేశారు. ఈ సమావేశంలో ఈఎన్సీ (అడ్మిన్‌) టి.శ్రీనివాస్, ఈఎన్సీ(ఓ అండ్‌ ఎం) మధుసూదన్‌రావుతో పాటు ప్రాజెక్టుల టెరిటోరియల్‌ చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌ఈలు హాజరయ్యారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)