సమ్మర్‌ స్పెషల్‌.. వేసవిలో వర్షాలు!

Published on Sun, 06/01/2025 - 03:21

సాక్షి, హైదరాబాద్‌: వేసవి సీజన్‌ కూల్‌గా గడిచిపోయింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదైనప్పటికీ వాతావరణంలో వేగంగా మార్పులు జరగడం... అకాల వర్షాలు... ముందస్తు రుతుపవనాలతో ప్రజలు వేసవి కాలాన్ని కూడా కూల్‌గా ఆస్వాదించారు. ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాల్లో ఈసారి ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువ రోజులు లేదు.

మార్చి నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదు కాగా ఆ తర్వాత అడపాదడపా కురిసిన వర్షాలతో ఎక్కువ రోజులు వాతావరణం చల్లగానే ఉంది. మరోవైపు వేసవి సీజన్‌లో వర్షాలు విస్తరంగా కురిశాయి. సీజన్‌లో కురవాల్సిన సాధారణ వర్షాల కంటే 203 శాతం అధికంగా వర్షాలు కురవడం గమనార్హం. గతేడాది వేసవి సీజన్‌లో సాధారణం కంటే 160 శాతం అధిక వర్షాలు కురవగా ఈ సీజన్‌లో అంతకు రెట్టింపు వర్షాలు కురిశాయి.

సాధారణానికి మించి..
రాష్ట్రవ్యాప్తంగా వేసవి సీజన్‌లో నెలవారీగా కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ మోతాదులోనే వర్షాలు నమోదయ్యాయి. సాధారణంగా మార్చి నెల నుంచి మే నెలాఖరు వరకు వేసవి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల కాలంలో రాష్ట్రంలో సగటున 55.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. అయితే గత నాలుగేళ్లుగా వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే సాధారణం, అంతకు మించి వర్షాలు నమోదవుతున్నాయి. 

2022 వేసవి సీజన్‌లో సగటున 42.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా 2024 వేసవిలో 80.5 మిల్లీమీటర్లు వర్షం నమోదైంది. గతేడాది నైరుతి సీజన్‌లో మాత్రం వర్షపాతం గణాంకాలు ఆశాజనకంగా లేవు. సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుత సీజన్‌లో వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈసారి వేసవి సీజన్‌లోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం చల్లబడింది.

మార్చిలో తక్కువగా..మేలో అత్యధికంగా...
ఈ ఏడాది మార్చి నెలలో సాధారణం కంటే కాస్త తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ఏప్రిల్‌ నెలలో మాత్రం సాధారణం కంటే 80 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మే నెలలో 376 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. మే నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో వర్షాలు భారీగా నమోదయ్యాయి. మరోవైపు ముందస్తుగా రుతుపవనాల రాకతోనూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురవడంతో వర్షపాతం గణాంకాలు అమాంతం పెరిగాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)