వన్యప్రాణుల రక్షణకు చర్యలు

Published on Thu, 05/15/2025 - 02:59

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచి్చ»ౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం భూ, అటవీ జంతువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక అందజేసింది. ప్రభుత్వం తరఫున ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు వివరాలు, ఫొటోలతో సహా అత్యున్నత న్యాయస్థానానికి అందజేశారు. ‘100 ఎకరాల్లో అటవీ నిర్మూలన కారణంగా ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించడానికి తీసుకోవలసిన చర్యలు, తక్షణం అమలు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించాలని రాష్ట్ర వన్యప్రాణి ఉన్నతాధికారులను ఆదేశించాం.

 ఏప్రిల్‌ 17, 21, మే 3, 8న రాష్ట్ర చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్, వన్యప్రాణుల నిర్వహణ నిపుణులతో కంచ గచి్చబౌలి భూములను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ భూములు 2,374 ఎకరాల్లో విస్తరించి ఉండగా, అందులో 400 ఎకరాలు వివాదాస్పదంగా మారింది. ఇవన్నీ రాళ్లు, చెట్లు, గడ్డితో కూడిన భూములు. అధికారుల తనిఖీల సమయంలో కొన్ని పక్షులు, మచ్చల జింకలు కనిపించాయి. 

ఈ ప్రాంతంలో చాలా వీధి కుక్కలు తిరుగుతున్నాయని, వాటి కారణంగా వన్యప్రాణులకు ముప్పు కలిగే అవకాశం ఉందని గ్రహించారు. దీనిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ చేసిన అభ్యర్థన మేరకు ఏప్రిల్‌ 4 నుంచి 30 మధ్య 26 వీధి కుక్కలను పట్టుకోవడానికి బృందాలను నియమించి చర్యలు తీసుకున్నాం’అని పేర్కొన్నారు.  

సీసీ కెమెరాలు అమర్చాం  
‘భూముల్లో వన్యప్రాణులపై నిఘా, రక్షణ కోసం 24 గంటలూ 3 షిఫ్టుల్లో ఐదుగురితో మూడు బృందాలను నియమించాం. నరికిన, ఎండిన చెట్లతో పాటు పొదలు ఎక్కువగా ఉండటం, వేసవిలో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉండటంతో నివారణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాం. వారికి ప్రత్యేక అగి్నమాపక యంత్రాలు అందజేశాం. ఏ ప్రాంతంలోనైనా వన్యప్రాణుల కదలికల పర్యవేక్షణ, సంగ్రహణకు 20 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశాం. 

జింకల నీటి అవసరాలకు 12 కృత్రిమ నీటి వనరులను నెలకొల్పాం. భద్రత పర్యవేక్షణలో భాగంగా సీసీ కెమెరాలు అమర్చాం. అడవి జంతువుల భద్రత కోసం వర్సిటీ, టీజీఐఐసీ, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. తక్షణ పశువైద్య సంరక్షణ, చికి త్స కోసం తెలంగాణ అటవీ శాఖతో కలిపి యాంటీ పోచింగ్‌ పేరిట స్క్వాడ్‌ను ఏర్పాటు చేశాం. అటవీశాఖ ఆధ్వర్యంలో చెట్ల పెంపకానికి చర్యలు తీసుకోవడంతోపాటు ఇకపై చెట్లను ఎవరూ నరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’అని నివేదికలో వివరించారు. ఈ కేసుపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)