Breaking News

రైతులకు మరింత ‘సహకారం’

Published on Mon, 01/08/2024 - 04:45

సాక్షి, హైదరాబాద్‌: ఎరువుల నుంచి విత్తనాలు, పురుగుల మందులు ఇలా అన్నీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనే అందుబాటులోకి రానున్నాయి. రైతులకు అవసరయ్యే సేవలు విస్తరించేందుకు ‘వన్‌స్టాప్‌ షాప్‌’ విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రాస్‌ (పీఎంకేఎస్‌కే) పథకంలో భాగంగా దీనిని ప్రవేశపెట్టింది. ఇది ఇక్కడ కూడా అమలులోకి వస్తే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ‘వన్‌స్టాప్‌ షాప్‌’ కేంద్రాలుగా మార్చుతారు.  

ఒకేచోట అన్ని సేవలు...
దేశవ్యాప్తంగా లక్ష ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్‌) ఉన్నాయి. వాటిల్లో 73,098 ప్యాక్స్‌లు ఎరువుల లైసెన్స్‌ కలిగి ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా లైసెన్స్‌ పరిధిలోకి తీసుకొస్తారు. తెలంగాణలో 1,423 ప్యాక్స్‌ ఉన్నాయి. అందులో 1,261 చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16,915 ఎరువుల రిటైల్‌ దుకాణాలుండగా, 14,870 చురుగ్గా పనిచేస్తున్నాయి.

అన్ని ప్యాక్స్‌లను ఎరువుల వ్యాపారంలోకి తీసుకొచ్చి అవన్నీ చురుగ్గా పనిచేసేలా కృషి చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ప్యాక్స్‌ల ద్వారా రైతులకు యూరియా, డీఏపీ వంటి ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి వాటిల్లో అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా అన్ని రకాల వ్యవసాయ ఉపకరణాలు అందించాలనేదే ఉద్దేశం. 

నాణ్యమైన సేవలు అందించవచ్చు
దేశంలో సహకార వ్యవసాయ పద్ధతులు అనుసరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అంటున్నారు. ప్రైవేట్‌లో ఎరువులు, పురుగు మందులు, విత్తన వ్యాపారుల ద్వారా అనేకచోట్ల కల్తీ, నకిలీ రాజ్యమేలుతోంది. ఆ దందాకు చెక్‌ పెట్టాలంటే ‘వన్‌స్టాప్‌ షాప్‌’ విధానం మేలని కేంద్రం చెబుతోంది. ప్యాక్స్‌ ద్వారా యూరియా వెళ్లడం వల్ల బ్లాక్‌ మార్కెట్‌ జరగకుండా చూసుకోవచ్చు.

అంతేగాకుండా కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు రైతులకు అంటగట్టకుండా నిరోధించవచ్చు. తక్కువ ధరల్లో రైతులకు వ్యవసాయ పనిముట్లు , సేంద్రీయ ఎరువులు కూడా ఇవ్వొచ్చు. భవిష్యత్‌లో ప్యాక్స్‌ ద్వారానే మార్కెటింగ్‌ వసతి కల్పించే ఆలోచనలో కూడా ఉన్నారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

అయితే ప్యాక్స్‌ల్లో అనేకం అప్పుల్లో కూరుకుపోయాయని, అవి ప్యాక్స్‌ రాజకీయాల్లో మునిగిపోవడం వల్ల వాటిల్లో కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయన్న చర్చ జరుగుతోంది. వాటిని అన్ని రకాలుగా బలోపేతం చేస్తే ‘వన్‌స్టాప్‌ షాప్‌’ విధానం విజయవంతమవుతుందని అధికారులు అంటున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)