Breaking News

ఒక్క రూపాయీ గ్రాంట్‌ రాలే!

Published on Sun, 08/04/2024 - 04:57

సాక్షి, హైదరాబాద్‌:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసిపోయింది. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇప్పుడేకాదు చాలా ఏళ్లుగా రాష్ట్రానికి గ్రాంట్లు ఇచ్చే విషయంలో కేంద్రం శీతకన్ను వేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన దాంట్లో సగం కూడా నిధులను మంజూరు చేయడం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. 

గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రూ.2,317 కోట్లు అయినా ఇవ్వగా.. ఈసారి అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.21 వేలకోట్లకుపైగా వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేసుకుంది.

పన్నుల వసూళ్లతోనే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌ 30వ తేదీ వరకు ఆదాయ, వ్యయాలపై రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు ఇచ్చిన నివేదికలోని గణాంకాల ప్రకారం పన్ను రాబడులు ఆశించిన మేర వస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో పన్ను రాబడులు రూ.11,464 కోట్లు వచ్చాయి. మే నెలలో కొంత తగ్గి రూ.10,954 కోట్లు వచ్చినా, జూన్‌లో మళ్లీ పుంజుకుని రూ.12,190 కోట్లు వచ్చాయి. 

మొత్తంగా మూడు నెలల్లో కలిపి అన్నిరకాల రాబడులు, పన్నుల్లో వాటా, అప్పులు కలిపి రూ.48,790.66 కోట్లు ఖజానాకు  సమకూరగా.. అందులో రూ.34,609 కోట్లు  పన్ను ఆదాయం కిందే అందాయి. అంటే  మొత్తం రాబడిలో 80శాతానికిపైగా పన్నుల రూపంలోనే ఖజానాకు వచ్చినట్టు అర్థమవుతోంది.

మూడు నెలల్లో రూ.13,171 కోట్ల అప్పులు
ఇక ఈ మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.13,171 కోట్లు అప్పుల రూపంలో సమకూర్చుకుంది. ఏప్రిల్‌లో రూ.2,246 కోట్లు, మేలో రూ.5,133 కోట్లు, జూన్‌లో రూ.5,790 కోట్లు రుణాలు తీసుకుంది. ఈ మొత్తంలో సగం వరకు గతంలోని అప్పుల అసలు, వడ్డీలకు చెల్లించినట్టు కాగ్‌కు సమర్పించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

ఏప్రిల్‌లో రూ.1,865 కోట్లు, మేలో రూ.1,864 కోట్లు, జూన్‌లో రూ.2,203 కోట్లు అప్పుల కింద చెల్లించారు. ఇక ఇతర ఖర్చుల విషయానికి వస్తే జీతాలకు రూ.11,026.69 కోట్లు చెల్లించారు. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో చెల్లించిన దానికంటే ఇది రూ.1,300 కోట్లు అధికం. పింఛన్ల కోసం రూ.4,311.62 కోట్లు, సబ్సిడీల కింద రూ.3,354 కోట్లు చెల్లించారు. మొత్తం రాబడిలో రూ.45,320.12 కోట్లు ఖర్చయిందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)