Breaking News

కావేవీ ఎన్నికల గుర్తులకు అనర్హం

Published on Sat, 11/29/2025 - 03:57

సాక్షి, హైదరాబాద్‌: ఉంగరం, కత్తెర, క్రికెట్‌ బ్యాట్, ఫుట్‌బా ల్, లేడీ పర్స్, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, స్పానర్, చెత్తడబ్బా ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా ? పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థులకు కేటాయించబోయే ఎన్నికల గుర్తులు. ఇవేకాకుండా మరో 20 గుర్తులు కూడా ఉన్నాయి.  

ఇంతేనా అనుకుంటున్నారా... 
గౌను, గ్యాస్‌పొయ్యి, స్టూల్, గ్యాస్‌ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్‌ యాంటినా వంటి రోజూ మనకు ఏదో ఒక పనిలో ఉపయోగపడే వస్తువులను వార్డులకు పోటీచేసే వారికి కేటాయించనున్నారు. వీటితో మరో పది ఎన్నికల గుర్తులు కూడా వార్డు అభ్యర్థులకు ఇస్తారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి కాబట్టి సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే వారికి కేటాయించేందుకు ఎన్నికల చిహ్నాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎంపిక చేసింది. 

ఎన్నికల సంఘం ప్రకటించిన ఈ గుర్తుల జాబితా నుంచే రిటరి్నంగ్‌ అధికారులు అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల క్రమం అనుసరించి వరుసగా కేటాయిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను (నామినేషన్‌ పేపర్‌లో ఉన్న పేర్ల ఆధారంగా) తెలుగు అక్షరమాల క్రమంలో రిటరి్నంగ్‌ అధికారి జాబితా రూపొందిస్తారు. అభ్యర్థి పేరులోని మొదటి అక్షరం ఆధారంగా పేర్ల క్రమాన్ని చూస్తారు. ఇందులో ఇంటిపేరును పరిగణనలోకి తీసుకోరు. 

ఒకే కేటగిరీలో ఇద్దరు అభ్యర్థులు ఒకే పేరుతో ఉంటే ఇంటిపేరు లోని మొదటి అక్షరం ఆధారంగా రెండుపేర్లను ఒక క్రమంలో ఉంచుతారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే పేరుతో ఉంటే ఇంటి పేర్లను తెలుగు అక్షరమాల క్రమంలో పరిగణనలో తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో అభ్యర్థుల వృత్తి, నివాసం ఇతర వివరాలు జతచేస్తూ విడిగా ఇవ్వాల్సి ఉంటుంది. 

నామినేషన్లు దాఖలు చేసిన క్రమంతో సంబంధం లేకుండా వర్ణమాల క్రమంలో తెలుగులో అభ్యర్థుల పేర్ల జాబితాను రూపొందిస్తారు. అభ్యర్థి పేర్లతో ఏదైనా గౌరవ ప్రదమైన, విద్యాపరమైన, వారసత్వ, వృత్తిపరమైన లేదా ఏదైనా ఇతర బిరుదులు జత చేసుకోవచ్చు కానీ అక్షర క్రమంలో పేర్లు అమర్చే జాబితాలో అలాంటి బిరుదులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరు. 

» సర్పంచ్‌ స్థానానికి పోటీపడుతున్న అభ్యర్థుల జాబితాలోని మొదట ఉన్న వ్యక్తికి ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన జాబితాలోని మొదటి చిహ్నాన్ని, రెండో అభ్యర్థి రెండో చిహ్నం అలా ఆ క్రమంలో మిగతా వారికి వరుసగా ఉన్న గుర్తులు కేటాయిస్తారు. 
» వార్డు సభ్యులుగా పోటీపడుతున్న అభ్యర్థుల జాబితాలోని మొదట ఉన్న వ్యక్తికి ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన జాబితాలోని మొదటి చిహ్నాన్ని, రెండో అభ్యర్థి రెండో చిహ్నం అలా ఆ క్రమంలో మిగతా వారికి వరుసగా ఉన్న గుర్తులు కేటాయిస్తారు. 

సర్పంచ్‌ అభ్యర్థులకు కేటాయించే ‘ఫ్రీ సింబల్స్‌’ఇవే... 
ఉంగరం, కత్తెర, క్రికెట్‌ బ్యాట్, ఫుట్‌బాల్, లేడీ పర్స్, టీవీ రి మోట్, టూత్‌పేస్ట్, స్పానర్, చెత్తడబ్బా, బ్లాక్‌బోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్‌ హ్యాండిల్, టీ జ ల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బాŠయ్‌్ట్సమాన్, మనిíÙ–తెరచాపతో పడవ, బిస్కెట్, వేణువు, చెయిన్, చెప్పులు, గాలి బుడగ, క్రికెట్‌ స్టంప్స్‌(వికెట్లు). 

వార్డు సభ్యులకు కేటాయించే ‘ఫ్రీ సింబల్స్‌’ఇవే... 
గౌను, గ్యాస్‌పొయ్యి, స్టూల్, గ్యాస్‌ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్‌ యాంటినా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, కవర్, హాకీ–బంతి, నెక్‌టై, కటింగ్‌ ప్లేయర్, పెట్టె, విద్యుత్‌ స్తంభం, టీ కెటిల్‌ 
నోటాకూ గుర్తు..: పంచాయతీ ఎన్నికల్లో నోటాకు కూడా గుర్తు కేటాయిస్తారు. నమూనా బ్యాలెట్‌ పేపర్‌పై కొట్టివేత మార్క్‌తో ఉన్నదే ఆ గుర్తు. 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)