Breaking News

ట్రంప్‌ ఆలోచన మోదీకి తప్ప ఎవరికీ అర్థంకాదు

Published on Sun, 09/21/2025 - 06:08

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనాతీరు ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీకి తప్ప ఎవరికీ అర్థం కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హెచ్‌–1బీ వీసాపై ఏటా లక్ష డాలర్ల రుసుం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఎందుకు మౌనం పాటిస్తోంది? దీని వెనుకున్న మర్మమేంటి? అని ఆయన ప్రశ్నించారు.

ఈ మేరకు శనివారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. హెచ్‌–1బీ వీసాలు పొందే దేశాల్లో భారత్‌దే మొదటి స్థానమని, ట్రంప్‌ నిర్ణయ ప్రభావం మనపైనే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ముందస్తుగా అమెరికాతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమయ్యిందని విమర్శించారు. ‘కనీసం ప్రస్తుతం ఉన్న అమెరికాలో ఉన్న హెచ్‌– 1బీ వీసాదారులకు మినహాయింపులను సాధించడంలోనూ కేంద్రం విఫలమయ్యింది. భారత్‌కు నష్టం చేకూర్చేలా ట్రంప్‌ ఇప్పటికే 50 శాతం టారిఫ్‌ విధించారు.

ఇప్పుడేమో హెచ్‌–1బీ వీసా ఫీజును పెంచారు. అయినా మోదీ ఎందుకు స్పందించడం లేదు? ట్రంప్‌ నిర్ణయం వల్ల అధికంగా ప్రభావం పడే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి లేఖ రాస్తాం. సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపకుండా.. ఇది మన మంచికే అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)