Breaking News

సింగరేణి లాభాల వాటాలో ‘శ్రీరాంపూర్‌’ ఫస్ట్‌

Published on Sun, 09/28/2025 - 04:40

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ప్రకటించిన లాభాల వాటాలో శ్రీరాంపూర్‌ ఏరియాలో పనిచేసే టింబర్‌ యార్డ్‌ వర్క్‌మన్‌ సుద్దిమల్ల శ్రీనివాస్‌కు అత్యధికంగా రూ.3,27,018 బోనస్‌ లభించనుంది. అలాగే మొత్తం సింగరేణి వ్యాప్తంగా అధికంగా బోనస్‌ అందుకునే మొదటి పది మందిలో ఈ ఏరియా నుంచే ఎనిమిది మంది ఉండడం విశేషం. సింగరేణి సంస్థ అందించే లాభాల వాటాలో ఏ విభాగంలోని కార్మికులకు ఎంత మొత్తం బోనస్‌ వస్తుందన్న వివరాలను శనివారం యాజమాన్యం వెల్లడించింది. 

దీని ప్రకారం.. మరో టింబర్‌యార్డ్‌ వర్క్‌మన్‌ మేషు కిశోర్‌ రూ.3,20,093, ఎస్టీపీసీ డీవైజీఎం ఎనగందుల శ్యాంరాజ్‌ రూ.3,13,724, ఆర్జీ–3 ఏరియా జీడీకే–11 సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌ నాగ వేణుగోపాల్‌ రూ.3,12,897 బోనస్‌గా అందుకోనున్నారు. 

అలాగే, శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్‌కేఎన్‌టీ గని హెడ్‌ ఓవర్‌మన్‌ జక్కినబోయిన సదానందం రూ.3,06,850, ఆర్కే–7 గని ఫోర్‌మన్‌ మెకానిక్‌ పుదారి ఉమేశ్‌గౌడ్‌ రూ.3,06,184, టింబర్‌ యార్డ్‌ వర్క్‌మన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌ రూ.3,05,614, ఆర్కే–5 గని ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌ బండారి శ్రీనివాస్‌ రూ.3,05,334, ఆర్జీ–1 ఏరియా జీడీకే–11 గని అదనపు మేనేజర్‌ బి.మల్లేశం రూ.3,03,759, శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్కే–5 గని ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌ అటికం శ్రీనివాస్‌ రూ.3,03,715 అందుకోనున్నారు. 

అండర్‌ గ్రౌండ్‌ కార్మికులకు మస్టర్‌కు రూ.805.37 
సింగరేణి సంస్థ 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో 34 శాతం వాటాను కార్మికులకు ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంస్థలో సుమారు 40 వేల మంది కార్మికులకు రూ.802.40 కోట్లు వాటాగా చెల్లించనున్నారు. కాగా, సింగరేణిలో పనిచేసే ఉద్యోగులను యాజమాన్యం వివిధ విభాగాలుగా విభజించింది. 

ఇందులో అండర్‌ గ్రౌండ్‌ కార్మికులకు మస్టర్‌ (ఒక రోజు హాజరు)కు రూ.805.37 చొప్పున చెల్లించనున్నారు. అంటే అత్యధిక హాజరు నమోదైన వారికి అత్యధిక బోనస్‌ అందనుంది. ఇక ఓసీ, సీఎస్‌పీ, ఎస్టీపీపీ ఉద్యోగులకు మస్టర్‌కు 637.58, డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులకు రూ.588.53 చొప్పున చెల్లించనున్నారు. ఈ లెక్కల ప్రకారం సింగరేణి యాజమాన్యం లాభాల బోనస్‌ డబ్బును సోమవారం కార్మికుల ఖాతాల్లో జమ చేయనుంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)