Breaking News

ఆ 19 ప్రాజెక్టులు.. ఇక స్పీడ్‌గా!

Published on Sat, 08/24/2024 - 05:02

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా భావిస్తు న్న 19 ప్రాజెక్టులను నిరీ్ణత కాలవ్యవధిలో పూర్తి చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సీఎం రేవంత్‌ ఇకపై ప్రతీనెలా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించనున్నారు. ‘స్మార్ట్‌ ప్రోయాక్టివ్‌ ఎఫిషియంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ’(స్పీడ్‌) పేరుతో సరికొత్త కార్యాచరణను చేపట్టినట్టు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. స్పీడ్‌ కార్యాచరణలో భాగంగా ఆ 19 ప్రాజెక్టులపై సంబంధిత విభాగాల అధికారులతో సీఎం నెలకోసారి సమావేశమవుతారు. ప్రాజె క్టుల పనుల్లో భాగంగా వివిధ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులు, అవరోధాలన్నింటినీ అధిగమించేందుకు ‘స్పీడ్‌’ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. పనుల్లో ఎక్కడా ఆలస్యం లేకుండా నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి స్థాయిలోనే అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ‘స్పీడ్‌’ దోహదపడుతుందని భావిస్తున్నారు. 

అన్ని చోట్లా ’స్పీడ్‌’ 
పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా...అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై ‘స్పీడ్‌’దృష్టి కేంద్రీకరిస్తుంది. ‘స్పీడ్‌’కార్యక్రమంలో భాగంగా తమ పరిధిలో చేపడుతు న్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తాయి. ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందనే నిరీ్ణత కాల వ్యవధిని ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటివరకు ఏయే పనులు పూర్తవుతాయనే పనుల అంచనాలను అందులో ప్రస్తావిస్తారు. ’స్పీడ్‌’ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా ప్రణాళిక విభాగం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను నిర్వహించనుంది, ఏ రోజుకు ఎంత పని జరిగిందనే అప్‌ డేట్‌ డేటాను ఇందులో పొందుపరుస్తారు. 

ఆ 19 ప్రాజెక్టులు ఏవంటే.. 
మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్, శాటిలైట్‌ టౌన్ల అభివృద్ధి, మెట్రోరైలు విస్తరణ, జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీ కరణ, రీజినల్‌ రింగ్‌ రోడ్, హైదరాబాద్‌ సిటీలో ఎలివే టెడ్‌ కారిడార్లు, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, ఢిల్లీ లో తెలంగాణ భవన్‌ నిర్మాణం, మహిళాశక్తి పథకం అమలు, జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం, సమీకృత గురుకుల పాఠశాలల సముదాయాలు, అమ్మ ఆదర్శ పా ఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి, ఐటీఐల్లో అడ్వా న్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు, కొత్త ఉస్మానియా హాస్పిటల్, 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారా మెడికల్‌ కాలేజీలు, హెల్త్‌ టూరిజం ప్రమోషన్, ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్, టెంపుల్‌ సర్క్యూట్స్‌ టూరిజం, మత్తుమందుల నిరోధక విధానం అమలు.

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)