Breaking News

మహాకుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

Published on Sat, 12/28/2024 - 04:45

సాక్షి, హైదరాబాద్‌: జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళా సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మౌలాలి–ఆజాంఘర్‌ (0707/0708) ప్రత్యేక రైలు జనవరి 18వ తేదీ, ఫిబ్రవరి 21 తేదీల్లో రాత్రి 11.55 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.15 గంటలకు ఆజాంఘర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 20, ఫిబ్రవరి 23 తేదీల్లో సాయంత్రం 7.45 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 7.30 గంటలకు మౌలాలి చేరుకుంటుంది. మౌలాలి–గయ (07711/7712) ప్రత్యేక రైలు జనవరి 19వ తేదీ సాయంత్రం 5.50 గంటలకు బయల్దేరి.. మర్నాడు ఉదయం 9 గంటలకు గయ చేరుకుంటుంది. 

తిరుగు ప్రయాణంలో జనవరి 21వ తేదీ సాయంత్రం 7.45 గంటలకు బయల్దేరి.. మర్నాడు ఉదయం 7.30 గంటలకు మౌలాలి చేరుకుంటుంది. మౌలాలి–గయ (07729/07730) ప్రత్యేక రైలు జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు బయల్దేరి.. మర్నాడు ఉదయం 9.30 గంటలకు గయ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 24వ తేదీ సాయంత్రం 7.45 గంటలకు బయల్దేరి.. మర్నాడు ఉదయం 7.30 గంటలకు మౌలాలి చేరుకుంటుంది. కాచిగూడ–పట్నా (07725/07726) ప్రత్యేక రైలు జనవరి 25వ తేదీ సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరి.. మర్నాడు ఉదయం 10.30 గంటలకు పట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 27వ తేదీ ఉదయం 11.30 గంటలకు బయల్దేరి.. మర్నాడు ఉదయం 7 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 

గుంటూరు–ఆజాంఘర్‌ (07701/07702) ప్రత్యేక రైలు జనవరి 24వ తేదీ రాత్రి 11 గంటలకు గుంటూరులో బయల్దేరి.. మర్నాడు సాయంత్రం 5.15 గంటలకు ఆజాంఘర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 26వ తేదీ సాయంత్రం 7.45 గంటలకు ఆజాంఘర్‌లో బయల్దేరి.. మర్నాడు ఉదయం 9 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. గుంటూరు–గయ (07719/07720) ప్రత్యేక రైలు జనవరి 25వ తేదీ మధ్యాహ్నం 2.20 గంటలకు గుంటూరులో బయల్దేరి.. మర్నాడు ఉదయం 9 గంటలకు గయ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 27వ తేదీ మధ్యాహ్నం 2.15 గంటలకు గయలో బయల్దేరి.. మర్నాడు ఉదయం 4 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)