Breaking News

తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి..

Published on Mon, 06/09/2025 - 12:03

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మరో పాలమూరు వాసికి చోటు దక్కింది. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగిన మక్తల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని అమాత్య పదవి వరించింది. ఈ మేరకు హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి రావడంతో బీసీ సంఘాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పరిధిలోని కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పాలమూరుకు వరమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి.. 
2023 ఎన్నికల్లో మక్తల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్‌ అభ్యరి్థగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. వెంటనే మంత్రి పదవి చేపట్టి ఘనత సాధించారు. గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నుంచి ఎల్కోటి ఎల్లారెడ్డి (మక్తల్‌), పి.చంద్రశేఖర్‌ (మహబూబ్‌నగర్‌), చిత్తరంజన్‌దాస్‌ (కల్వకుర్తి), శ్రీనివాసరావు (నాగర్‌కర్నూల్‌), పులి వీరన్న (మహబూబ్‌నగర్‌)కు ఈ అవకాశం దక్కగా.. శ్రీహరి వారి సరసన చేరడం విశేషం. కాగా, వాకిటి శ్రీహరితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ విద్యావంతులే. శ్రీహరితో పాటు ఆయన భార్య, ఆయన తమ్ముడు, మరదలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే ఉన్నారు.  

వ్యవసాయ కుటుంబం నుంచి.. 
మక్తల్‌ పట్టణం నేతాజీ నగర్‌కు చెందిన వాకిటి శ్రీహరిది తొలుత వ్యవసాయ కుటుంబం కాగా.. కాంగ్రెస్‌లో చేరి క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు.          కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌        కాంగ్రెస్‌తో పాటు పార్టీలో మండల, ఉమ్మడి జిల్లా, విభజన అనంతరం నారాయణపేట జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు. వాకిటి శ్రీహరి తల్లి రాములమ్మ స్టాఫ్‌ నర్స్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా వేలాది మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కాన్పులు చేసి రాములమ్మ సిస్టర్‌గా పేరు సాధించారు. 

తండ్రి వాకిటి నరసింహులు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్‌గా పనిచేశారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం కాగా.. నాలుగో కాన్పులో శ్రీహరి జని్మంచారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న ఆయన డిగ్రీ (బీఏ) దాకా విద్యాభ్యాసం కొనసాగించారు. 1996లో  రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మక్తల్‌ సర్పంచ్‌గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా సామాజిక సమీకరణాల్లో భాగంగా  బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కాంగ్రెస్‌ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది.  

మంత్రి శ్రీహరిని సన్మానించిన ఎమ్మెల్యే యెన్నం  
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మక్తల్‌ ఎమ్మెల్యే వాకిట శ్రీహరిని ఆదివారం మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్, నాయకులు బెక్కరి మధుసూదన్‌రెడ్డి, ముకుందం రమేష్‌ పాల్గొన్నారు.              
  

విధేయత.. సామాజిక సమీకరణాలు.. 
వాకిటి శ్రీహరి విద్యార్థి దశలో యూత్‌ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆ పారీ్టలోనే కొనసాగారు. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రను మక్తల్‌ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. దీంతో పాటు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు, అందులోనూ ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కలి్పంచాలన్న డిమాండ్‌ పెరిగింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌ సైతం ముదిరాజ్‌కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే కాగా.. విధేయత, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్‌ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

  • రాజకీయ నేపథ్యం.. 
    వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993 వరకు ఎన్‌ఎస్‌యూఐ మక్తల్‌ మండల ప్రెసిడెంట్‌గా.. 1993–1996 వరకు యూత్‌ కాంగ్రెస్‌ మక్తల్‌ మండల అధ్యక్షుడిగా.. 1996 నుంచి 2001 వరకు మక్తల్‌ మండల కాంగ్రెస్‌ కార్యదర్శిగా పనిచేశారు.  

  • 2001–2006 వరకు మక్తల్‌ మేజర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డుల్లోకెక్కారు.  

  • 2001–2006 ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 

  • 2006 నుంచి 2011 వరకు వాకిటీ శ్రీహరి    సతీమణి వాకిటి లలిత దాసర్‌పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2006 నుంచి 2011  వరకు ఆమె కాంగ్రెస్‌ మక్తల్‌ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. 

  • 2006 నుంచి 2012 వరకు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి మక్తల్‌ మేజర్‌ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌గా.. 2006 నుంచి 2014 వరకు యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 

  • 2014 నుంచి 2018 వరకు వాకిటి శ్రీహరి మక్తల్‌ జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రెండో మెజార్టీ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్‌ జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌ లీడర్‌గా.. 2014 నుంచి 2018 వరకు మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.  

  • 2018 నుంచి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో కలిసి పనిచేశారు. 

  • 2019లో వాకిటి శ్రీహరి సోదరుడి భార్య రాధిక మక్తల్‌ మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. 

  • 2022 సెపె్టంబర్‌ 03 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

  • 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి మక్తల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై 17,525 ఓట్లతో గెలుపొందారు. తాజాగా రెండో దఫాలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్‌లో చోటుదక్కించుకున్నారు.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)