Breaking News

ఇది.. సైనికుల సంగ్రామం!

Published on Thu, 08/15/2024 - 09:36

ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలా ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత ‘దేశభక్తి’. దేశాన్ని కాపాడాలనే ధ్యేయంతో ఊరి యువకులు సైన్యం బాట పట్టారు. ఒకే ఊరి నుంచి ఇంటికి ఒక్కరు చొప్పున సుమారుగా 92 మందికిపైగా యువకులు సైన్యంలో తమ సేవలను అందిస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు పీపుల్స్‌వార్‌ ఖిల్లాగా ఉన్న ఆ ఊరిని ఇప్పుడు ఆర్మీ జవాన్ల పుట్టినిల్లుగా పిల్చుకుంటున్నారు. ఆ ఊరు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్‌ గ్రామం. ఆ ఊరి ముచ్చట్లలోకి వెళదామా?

సుమారు 40 ఏళ్ల క్రితం కట్కూర్‌ గ్రామానికి చెందిన జేరిపోతుల డేనియల్‌ మిలిటరీలో జవాన్‌ గా చేరాడు. ఆయన స్ఫూర్తితో గ్రామంలోని యువకులు సైన్యం బాటపట్టారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఆర్మీలో చేరారు. జవాన్‌  స్థాయి నుంచి లాన్స్‌నాయక్, నాయక్, హవల్దార్, నాయక్‌ సుబేదార్‌ స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇలా గ్రామానికి చెందిన వారు ప్రస్తుతం 92 మంది ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతో జిల్లాలో కట్కూరు గ్రామం అంటే ఆర్మీజవాన్‌ ల గ్రామంగా గుర్తింపు ΄÷ందింది. ఈ గ్రామంలో 1,014 కుటుంబాలుండగా జనాభా సుమారుగా 3,045 ఉన్నారు. అందులో మొత్తం గ్రామంలో 175 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వీరిలో కొందరు ఇతర ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. – మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేట

దేశసేవ  ఇష్టం...
దేశసేవ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే 1998లో భారతసైన్యంలో చేరాను. మద్రాస్‌ ఇంజినీరింగ్‌ గ్రూప్‌ బెంగళూర్‌లో ట్రైనింగ్‌ చేశాను. కార్గిల్‌ యుద్ధంలో కూడా పాల్గొన్నాను. కాశ్మీర్‌లో రాష్ట్రీయ విభాగంలో సేవలు అందించి అనేక టెర్రరిస్ట్‌ ఆపరేషన్‌ లలో పాల్గొన్నాను. కాశ్మీర్‌ సేవలను గుర్తించి నాకు సుబేదార్‌ మేజర్‌గా ప్రమోషన్‌  ఇచ్చారు. – పంజా సదయ్య, సుబేదార్‌

గర్వపడుతున్నా...
దేశరక్షణ కోసం సైన్యంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేశం కోసం పని చేయడం ఆనందంగా ఉంది. – కొయ్యడ శ్రీనివాస్, ఆర్మీ జవాన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)