Breaking News

రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి  

Published on Sun, 08/13/2023 - 03:48

రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌రంజన్‌ పేర్కొన్నారు. నానక్‌రాంగూడలోని షరటాన్‌ హోటల్‌లో శనివారం రోబోటిక్‌ గైనకలాజికల్‌ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్‌ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్‌ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్‌ ఆటోమేషన్, కన్సూ్మర్‌ రోబోటిక్స్‌ అనే నాలుగు వర్టికల్స్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్‌ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు.

నిమ్స్‌లో డావిన్సీ ఎక్స్‌ఐ 4వ వెర్షన్‌ సిస్టమ్‌ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్‌ సర్జరీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్‌ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్‌ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్‌ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్‌ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు ప్రొఫెసర్‌ రమాజోíÙ, ఆర్నాల్డ్‌ పి.అడ్విన్కులా, డాక్టర్‌ టోనిచల్‌ హౌబ్, డాక్టర్‌ జోసెఫ్‌ పాల్గొన్నారు.  

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)