Breaking News

వాహ్‌.. బాస్మతి!

Published on Sun, 10/06/2024 - 02:19

సాక్షి హైదరాబాద్‌: ఒక్కప్పుడు నవాబులు, ధనికుల ఇళ్లల్లో బాస్మతి బియ్యం వినియోగించేవారు. ఇప్పుడు ధరలు అందుబాటులోకి రావడంతో దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు బాస్మతిని వినియోగిస్తున్నారు. నాడు బిర్యానీకే పరిమితంకాగా, ఇప్పుడు అన్ని రకాల వంటకాల్లో వినియోగిస్తున్నారు. మొదటి రకం సాధారణ బియ్యం కిలో ధర దాదాపు రూ. 70–80 ఉంది. అదే బాస్మతి హోల్‌సేల్‌ ధర కూడా దాదాపు అంతే. దీంతో నగరంలో బాస్మతి బియ్యం వినియోగం ఎక్కువైంది. గతంలో బిర్యానీ కోసం బాస్మతిని తప్పక వాడేవారు. 
కానీ, నేడు బగారా, పల్వా, లెమన్, కిచిడి, జీరా రైస్‌తోపాటు అన్ని రకాల వంటకాల్లో బాస్మతిని వినియోగిస్తున్నారు.  

ఉత్తరాది పంటకు నగరంలో ఆదరణ 
ధరలు తగ్గడంతో హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాల మార్కెట్‌లకు భారీ ఎత్తున బాస్మతి బియ్యం దిగుమతి అవుతోంది. బాస్మతి వరి పండే ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి భారీగా దిగుమతులు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. బేగంబజార్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్‌ టోకు మార్కెట్లు ఈ బియ్యం అమ్మకాలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. స్టార్‌ హోటళ్లు, ఇతర బిర్యానీ హోటళ్లన్నీ కూడా బాస్మతిని ఈ మార్కెట్‌ల నుంచే కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు అంటున్నారు. 

 గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు 60 వేల క్వింటాళ్ల సాధారణ బియ్యం వినియోగం అవుతుండగా, ఇందులో బాస్మతి బియ్యం దాదాపు 12 వేల క్వింటాళ్ల వరకూ ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఈసారి బాస్మతి ఉత్పత్తి భారీగా ఉండడంతో నగరానికి సరఫరా పెరిగింది. రిటైల్‌ మార్కెట్‌లో స్టీమ్‌ కేజీ బాస్మతి బియ్యం రూ.50 నుంచి రూ.65 వరకు లభిస్తున్నాయి. అదే రా బాస్మతి బియ్యం మొదటి రకం రూ.80–110 వరకు ధర పలుకుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పండే బాస్మతి వినియోగం ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో తక్కువ. దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్‌ బాస్మతికి హబ్‌గా మారింది. దేశంలో ఢిల్లీ తరువాత  గ్రేటర్‌లోనే ఎక్కువ వినయోగం ఉందని బేగంబజార్‌ వ్యాపారులు చెబుతున్నారు.

సాధారణ బియ్యం ధరకే బాస్మతి 
బాస్మతి ఎక్కువగా పంజాబ్‌లో పండిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బియ్యం వినియోగం తక్కువ.. హైదరాబాద్‌ బిర్యానీకి ఫేమస్‌. దీంతో హైదరాబాద్‌లో వినియోగం ఎక్కువ. మరోవైపు బాస్మతిని బిర్యానీలో తప్పక వినియోగిస్తారు. అయితే కోవిడ్‌ తరువాత బాస్మతి ఎగుమతులు అంతగా లేవు. దీంతో ధరలు చాలా కిందికి దిగి వచ్చాయి. సాధారణ బియ్యం ధరలకే బాస్మతి మార్కెట్‌లో లభిస్తోంది. 
– రాజ్‌కుమార్‌ ఠాండన్, కశ్మీర్‌హౌస్‌ నిర్వాహకుడు, బేగంబజార్‌   

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)