Breaking News

‘కొడుకా శ్రీనివాసు.. కొరివి పెట్టేందుకైనా రాబిడ్డా..’

Published on Sat, 02/08/2025 - 13:35

ఖానాపూర్‌(నిర్మల్‌): ‘కొడుకా శ్రీనివాసు.. 14 ఏండ్ల వయసులో బడికి పోతానని వెళ్లి 50 ఏండ్లు గడిసినయ్‌. నీకు తల్లి గుర్తుకు రావడం లేదా.. చావుకు దగ్గరైన. కొరివి పెట్టేందుకై నా రాబిడ్డా’ అని అజ్ఞాతంలో ఉన్న మవోయిస్తు తూము శ్రీనివాస్‌ తల్లి లచ్చవ్వ ప్రాధేయపడింది. మండలంలోని బావాపూర్‌(ఆర్‌) గ్రామంలోని లచ్చవ్వ కుమారుడు 50 ఏళ్ల క్రితం 14 ఏళ్ల వయస్సులో బోధన్‌లోని ప్రైవేట్‌ స్కూల్‌కు వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాకుండా మావోయిస్టుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు అతని తల్లిని ఎస్పీ జానకీ షర్మిల శుక్రవారం కలిసింది. వనం వీడి జనంలోకి రావాలని ఎస్పీ సాక్షిగా లచ్చవ్వ కుమరుడిని ప్రాధేయపడింది. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోరు కన్నా.. ఊరు మిన్నా.. మన ఊరికి తరలి రండి.. కార్యక్రమంలో భాగంగా జన జీవనంలోకి వచ్చే మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస కల్పిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ తల్లి లచ్చవ్వకు దుస్తులతోపాటు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐ సైదారావు, పెంబి ఎస్సై హనుమాండ్లు పాల్గొన్నారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)