Breaking News

9న నైరుతి

Published on Sat, 06/06/2026 - 04:52

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 9న రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల కదలిక మరింత చురుకుగా ఉంటే ఒక రోజు ముందే రాష్ట్ర భూభాగంలోకి ప్రవేశించవచ్చని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం నాటి పరిస్థితుల ఆధారంగా నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి (నార్తన్‌ లిమిట్‌ ఆఫ్‌ మాన్సూన్‌), మంగళూరు, ఊటీ, కొడైకెనాల్, తూత్తుకుడి మీదుగా ముందుకు సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

రానున్న రెండ్రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని భాగాలు, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగాలతో పాటు నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ–మధ్య, తూర్పు–మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలలోకి రుతుపవనాలు విస్తరిస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

తేలికపాటి వర్షాలు...పలుచోట్ల మోస్తరు 
రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు చాలాప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలతో పాటు వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. వాతావరణంలో మార్పులు, వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి.

చాలా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు, కొన్ని చోట్ల సాధారణం కంటే కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్‌ వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో గరిష్ట ఉష్ణోగ్రత 40.8డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 23.4 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. 

శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు(సెల్సీయస్‌లలో) 
================================  
కేంద్రం        గరిష్టం        కనిష్టం 
భద్రాచలం        40.8        27.0 
ఖమ్మం        40.4        25.4 
ఆదిలాబాద్‌    40.3        24.7 
రామగుండం    40.3        27.7 
హనుమకొండ    39.0        24.0 
నిజామాబాద్‌    39.0        24.3 
నల్లగొండ        39.0        23.4 
మహబూబ్‌నగర్‌    37.4        26.5 
మెదక్‌        36.8        24.2 
హకీంపేట్‌        36.6        27.4 
హైదరాబాద్‌    36.6        27.0 
దుండిగల్‌        36.5        26.0 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)