Breaking News

’అతివ’కు హైదరాబాద్ భేష్

Published on Fri, 01/10/2025 - 05:14

సాక్షి, హైదరాబాద్‌: మహిళలకు భద్రత, నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలతో పాటు ఇతర ప్రామాణిక అంశాల్లో దేశవ్యాప్తంగా అత్యుత్తమ 5 నగరాల్లో హైదరాబాద్‌ నగరం ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా 120 నగరాల్లో అవతార్‌ గ్రూప్‌ చేపట్టిన సర్వేలో 2024 సంవత్సరానికి హైదరాబాద్‌ 4వ స్థానంలో ఉండగా.. ఈ టాప్‌ 5 (బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, పుణె) నగరాల్లో 3 దక్షిణాది నుంచే ఉండటం విశేషం. 

ఇందులో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. అవతార్‌ గ్రూప్‌ నిర్వహించిన ‘టాప్‌ సిటీస్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ ఇండియా–2024’ (టీసీడబ్ల్యూఐ) ఇండెక్స్‌ సర్వేను బుధవారం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్‌ సౌందర్య రాజేశ్‌ వెల్లడించారు. ఈ ఇండెక్స్‌ సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ది ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ), వరల్డ్‌ బ్యాంక్, క్రైమ్‌ రికార్డ్స్, పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వంటి వివిధ డేటా వనరుల ఆధారంగా తయారు చేశారు. 

మౌలిక సదుపాయాలు, టెక్‌ జాబ్స్‌ భేష్‌... 
120 నగరాల్లో సర్వే చేపట్టగా, మౌలిక సదుపాయాల కల్పనలో 8.01 పాయింట్లతో హైదరాబాద్‌ అత్యధిక స్కోర్‌ను సాధించింది. మెరుగైన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్, ప్రయాణ సౌకర్యాలలోనూ ఆదర్శ నగరంగా నిలిచింది. ముఖ్యంగా మహిళ భద్రత కోసం షీ టీమ్స్, మెట్రో రైలు ప్రధానాంశాలుగా నిలిచాయి.

 టెక్నాలజీ రంగంలో మహిళలు అత్యధిక ఉద్యోగాలు పొందిన నగరాల జాబితాలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. భద్రతలో 6.95 పాయింట్ల తో 2వ స్థానంలో ఉంది. నైపు ణ్యం, ఉపాధిలో 6.95 పాయింట్లతో 5వ స్థానంలో నిలువగా... ఈ వరుసలో ముంబై, బెంగళూరు, గురుగ్రామ్‌ ముందంజలో ఉన్నా యి. మొత్తంగా మహిళలకు అత్యుత్తమ నగరాల్లో దక్షణాది రాష్ట్రాలు భేష్‌ అనిపించుకున్నాయి. 

హక్కులు, సమానత్వం అందాలి
అవతార్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా ఈ సర్వే నిర్వహిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మహిళలకు రక్షణ, ఆరోగ్యం, వారు చేసే ఉద్యోగాల్లో సురక్షిత వాతావరణం, జీవన నాణ్యత తదితర అంశాలు ప్రధానమైనవి. 2047 వరకు వికసిత్‌ భారత్‌గా నిర్మించుకోవడంలో మహిళల హక్కులు, సమానత్వం కీలకం.   
– డాక్టర్‌ సౌందర్య రాజేశ్, అవతార్‌ గ్రూప్‌ అధ్యక్షురాలు 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)