HYD: కేటీఆర్‌ బావ మరిది ఫామ్‌ హౌస్‌లో రేవ్‌ పార్టీ భగ్నం..

Published on Sun, 10/27/2024 - 09:51

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో బీఆర్‌ఎస్‌ నేత బావమరది ఫామ్‌ హౌస్‌లో జరుగుతున్న రేవ్‌ పార్టీని సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. వీఐపీల రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, ఫారిన్‌ లిక్కర్‌, డ్రగ్స్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. అలాగే, రేవ్‌ పార్టీలో క్యాసినో కూడా ఆడినట్టు సమాచారం. క్యాసినోకు సంబంధించిన మెటీరియల్‌ను ఫామ్‌ హౌస్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

వివరాల ప్రకారం.. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌లో వీఐపీల రేవ్‌ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. డీజే సౌండ్స్‌తో బీభత్సం సృష్టించడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో, రంగంలోకి దిగిన సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు రేవ్‌ పార్టీని భగ్నం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రేవ్‌ పార్టీలో విదేశీ మద్యం, డ్రగ్స్‌ ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో వారికి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా కొకైన్‌ తీసుకున్నట్టు తేలింది. మరో ఇద్దరికి కూడా డ్రగ్స్‌ పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. పార్టీలో 42 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది.

 

ఈ నేపథ్యంలో ఎన్‌డీపీఎస్‌ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక, రైడ్‌ సందర్భంగా భారీగా విదేశీ మద్యం, డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన విదేశీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. దీంతో, సెక్షన్‌-34 ఎక్సైజ్‌ యాక్ట్‌ కింద మరో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. రేవ్‌ పార్టీ నిర్వహించిన ఫామ్‌హౌస్‌కు పేరు లేకపోవడం గమనార్హం.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)