Breaking News

కొరియోగ్రాఫర్‌ జానీ అరెస్ట్‌

Published on Thu, 09/19/2024 - 11:05

సాక్షి, హైదరాబాద్‌: మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన  కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జనసేన సస్పెండెడ్‌ నేత జానీ మాస్టర్‌(షేక్‌ జానీ బాషా) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోవాలో జానీని ట్రేస్‌ చేసిన సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు.. అక్కడే అరెస్ట్‌ చేశారు. 

సహా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న జానీపై.. నార్సింగి పీఎస్‌లో సెప్టెంబర్‌ 15వ తేదీన కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆపై జానీ ఆచూకీ లేకపోవడంతో.. పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. చివరకు.. గోవాలో అరెస్ట్‌ చేసి అక్కడే కోర్టులో హాజరుపరిచ్చారు. గోవా కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతిస్తూ.. 24 గంటల్లోగా ఉప్పరపల్లి  కోర్టులో జానీ బాషాను హాజరుపరచాలని ఆదేశించింది. దీంతో జానీని పోలీసులు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు.   

లైంగిక వేధింపుల ఆరోపణలతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించసాగాడని బాధితురాలు చెప్పడంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు జత చేశారు. అయితే కేసు తర్వాత జానీ ఆచూకీ తెలియరాలేదు. భార్యతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. తన ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసుకున్నాడు. 

ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!

తొలుత పోలీసులు కొండపూర్‌లోని నివాసానికి వెళ్లి చూడగా.. తాళం వేసి ఉంది. ఆపై స్వస్థలం నెల్లూరులో ఉండొచ్చని వెళ్లి చూడగా.. అక్కడా లేడు. ఆ తర్వాత లడ్ఢాఖ్‌లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను సంప్రదించారు. మొత్తంగా నాలుగు టీంలతో ఆపరేషన్‌ జానీ ముమ్మరంగా కొనసాగగా.. చివరకు గోవాలో పట్టుబడ్డాడు. 

తెలుగుతో పాటు కోలీవుడ్‌, హిందీలోనూ పలు స్టార్‌ హీరోలకు జానీ కొరియోగ్రాఫ్‌ చేశాడు. అంతేకాదు.. పవన్‌ కల్యాణ్‌ జనసేనలోనూ మొదటి నుంచి క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. అయితే.. లైంగిక వేధింపులు వెలుగులోకి రావడంతో పార్టీ అతన్ని దూరం పెడుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఇది కూడా చదవండి: జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: బీజేపీ మహిళా మోర్చా

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)