Breaking News

ఇంటి నుంచి తల్లిని గెంటేసిన కుమారులు.. షాకిచ్చిన అధికారులు

Published on Fri, 06/27/2025 - 07:30

సాక్షి, హైదరాబాద్‌: మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్న తీరు మానవత్వానికే మచ్చలా నిలుస్తోంది. చివరికి తమను కని, పెంచి, ప్రయోజకులను చేసిన కన్నవారి పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్న వైనం మనసులను కకావికలం చేస్తుంది. అయితే వృద్ధాప్యంలోనూ తనను పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటేసిన కొడుకులకు ఓ తల్లి తగిన బుద్ధి చెప్పింది. జిల్లా రెవెన్యూ అధికారుల సహాయంతో ఎట్టకేలకు తన సొంతింటిని తాను సొంతం చేసుకుంది.

మూసారాంబాగ్‌ డివిజన్‌ ప్రశాంత్‌నగర్‌కు చెందిన శకుంతులా బాయి (90)కి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. భర్త చాలా ఏళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి తన నివాసంలో కొడుకులతో కలిసి ఉండేది. కొంత కాలం తర్వాత తల్లి ఆలనా పాలన చూడాల్సిన కుమారులు నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టారు. అంతే కాకుండా తల్లిని బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపేశారు. దాంతో గత్యంతరం లేక వృద్ధురాలు ఏడాదిన్నరగా సైదాబాద్‌లోని చిన్న కూతురు ఇంటి వద్ద ఉంటుంది.

తన బాగోగులు చూడని కొడుకులు తన ఇంట్లో ఉండ కూడదని నిర్ణయించుకుంది. సీనియర్‌ సిటిజెన్స్‌ అసోషియేషన్‌ ప్రతినిధులతో కలిసి వెళ్లి హైదరాబాద్‌ జిల్లా ఆర్‌డీఓను 2024 ఫిబ్రవరిలో తనకు న్యాయం చేయాలని ఆశ్రయించింది. ఆర్‌డీఓ ఆమె ఇద్దరు కుమారులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇంటిని తల్లికి ఇవ్వడానికి మొదట ఇద్దరూ అంగీకరించారు. అయితే నెలలు గడుస్తున్నా వారు ఇంటిని ఖాళీ చేయడం లేదు.

ఆర్‌డీఓ ఆదేశాల మేరకు సైదాబాద్‌ తహసీల్దార్‌ జయశ్రీ వారికి పలుమార్లు నోటీసులు ఇచ్చినా వారు స్పందించ లేదు. దాంతో తహసీల్దార్‌ మూడు రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేయాలని లేకుంటే సీజ్‌ చేస్తామని హెచ్చరిస్తూ ఫైనల్‌ నోటీసులు ఇచ్చారు. దాంతో వారు ఇంటికి తాళం వేసి సమాచారం ఇవ్వకుండా ఎటో వెళ్లిపోయారు. గురువారం సైదాబాద్‌ తహసీల్దార్‌ సిబ్బందితో వచ్చి ఇంటిని సీజ్‌ చేసారు. శకుంతలా బాయికి ఇల్లు అప్పగిస్తామని తహసీల్దార్‌ తెలిపారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)