నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
కారు కొనిపెట్టలేదని యువకుడి బలవన్మరణం
Published on Sun, 06/01/2025 - 21:21
సిద్దిపేట జిల్లా, సాక్షి: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.తండ్రి బీఎండబ్ల్యూ కారు కొన్నివ్వ లేదని కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగదేవ్ పూర్ మండలం చర్లపల్లిలో చోటు చేసుకుంది.
గత కొంత కాలం నుంచి తండ్రి బొమ్మ కనకయ్యను బీఎండబ్ల్యూ కారు కొనిపెట్టమని ఆయన కుమారుడు జానీ అడుగుతూ వస్తున్నాడు. అయితే, జానీ విజ్ఞప్తిని తండ్రి కనకయ్య సున్నితంగా తిరస్కరించాడు. స్విఫ్ట్ డిజైర్ కారుతో సరిపెట్టుకోమని సూచించాడు. తండ్రి తీరుతో కోపోద్రికుడైన జానీ ఇంట్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానీ కొద్ది సేపటి క్రితం మృతి చెందినట్లు సమాచారం. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Tags : 1