Breaking News

వినియోగదారులపై తులాభారం!

Published on Sun, 12/07/2025 - 03:55

సాక్షి, హైదరాబాద్‌: కూరగాయలు సహా నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఓవైపు అల్లాడుతుంటే మరోవైపు కొందరు వ్యాపారులు మాత్రం తూకాల్లో మోసాలతో ప్రజలను మరింత గుల్ల చేస్తున్నారు. తక్కెడలు, డిజిటల్‌ తూకాల్లో ప్రతి కిలోపైనా 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు నొక్కేస్తున్నారు. అలాగే కొన్ని పెట్రోల్‌ బంకుల్లో ఫ్యూయల్‌ డిస్పెన్సర్‌ల నుంచి తక్కువ పెట్రోల్‌ వచ్చేలా మైక్రోకంట్రోలర్ల (చిప్‌లు)లో మార్పులు లేదా రిమోట్‌ ఆపరేటింగ్‌ ద్వారా ప్రతి లీటర్‌పైనా సుమారు 200 మిల్లీలీటర్ల వరకు కొల్లగొడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. 

తూనికలు–కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తున్నా ఆయా వ్యాపారుల తీరు మాత్రం మారడంలేదు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై అధికారులు 2022–23లో 8,498 కేసుల్లో రూ. 6.41 కోట్ల మేర, 2023–24లో 9,055 కేసుల్లో రూ. 7.09 కోట్ల మేర, 2024–25లో 8,538 కేసుల్లో రూ. 6.36 కోట్ల మేర జరిమానాలు విధించారు. 

రాష్ట్రంలో 2022–23లో 281 ఫిర్యాదులు రాగా వాటన్నింటినీ పరిష్కరించిన అధికారులు 2024–25లో వచ్చిన 621 ఫిర్యాదుల్లో 567 పరిష్కరించారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా మోసాలను అరికట్టవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

ఇలా చేద్దాం...
» నిత్యావసర వస్తువులు కొనేటప్పుడు వాటిపై ప్యాకేజీ తేదీ, చిరునామా, బరువు, కొలతను చూడాలి. వాటిని అక్కడే ఒకసారి తూకం చేసి బరువును నిర్ధారించుకోవాలి.
»  వస్తువులపై ముద్రించి ఉండే గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ)కన్నా అధికంగా వసూలు చేసే వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖకు ఫిర్యాదు చేయాలి.
» ఒక్కోసారి కొందరు వ్యాపారులు వస్తువుల ముద్రిత ధరలు కనిపించకుండా అధిక ధరల స్టిక్కర్లు అతికిస్తుంటారు. అలాంటి వారిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలి. నేషనల్‌ కన్సూమర్‌ హెల్ప్‌లైన్‌ (ఎన్‌సీహెచ్‌) మొబైల్‌ యాప్‌లో కూడా బాధితులు ఫిర్యాదు చేయొచ్చు. 1915, 1800114000 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్‌ చేసి కూడా సమస్యలను తెలియజేయవచ్చు.
»  ఏదైనా వస్తువు కొనేటప్పుడు బిల్లు, రశీదు, ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసిన తర్వాత వచ్చే ఇన్వాయిస్, ఐడీలను భద్రంగా ఉంచుకోవాలి.
» మోసాల్లో ఆరితేరిన వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ ప్రత్యేక నిఘా పెట్టాలి. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేయాలి.
» తూకాల్లో మోసాలపై ప్రజలకు సంతలు, మార్కెట్‌ యార్డుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

Videos

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)