Breaking News

హాస్టల్‌లో హుక్కా

Published on Sun, 08/24/2025 - 04:41

కేశంపేట: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధి లోని కొత్తపేటలోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌ లో కొందరు విద్యార్థులు హుక్కాకు అలవాటు పడ్డారు. ఏకంగా యూట్యూబ్‌లో చూసి అవసరమైన సామగ్రి ఆన్‌లైన్‌లో, తెలిసినవారి నుంచి సమకూర్చుకొని స్వయంగా హుక్కా  తయారు చేశారు. హాస్టల్‌లో ఉండే కొత్తపేటకు చెందిన ఇంటర్‌ విద్యార్థికి షాద్‌నగర్‌లోని ఓ హోటల్‌లో పనిచేసే మిత్రుడు ఉన్నాడు. ఇతని ద్వారా హుక్కా పీల్చడం అలవాటు చేసుకున్నాడు. 

మరో ఇద్దరు విద్యార్థులకు అలవాటు చేశాడు. అలా పదోతరగతి లోపు చదువుతున్న 20 మంది హుక్కాకు బానిసలుగా మారారు. ఇదంతా ఓ నాలుగో తరగతి విద్యార్థి గమనించగా, అతడిని కొట్టి బలవంతంగా హుక్కా తాగించారు. విషయం తెలుసుకున్న వార్డెన్‌ ఇద్దరు విద్యార్థులను హాస్టల్‌ నుంచి ఇంటికి పంపించారు. 

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హుక్కా పీల్చేందుకు గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్‌ గోడ దూకి, విద్యుత్‌ దీపాలు ఆర్పివేశాడు. దీంతో మిగిలిన విద్యార్థులు రాత్రంతా భయంభయంగా గడిపి శనివారం ఉదయమే హాస్టల్‌ సిబ్బందికి తెలిపారు. హాస్టల్‌లో తనిఖీ చేయగా హుక్కా మిషన్‌తోపాటు సామగ్రి లభించాయి. ఇంటర్‌ విద్యార్థిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్టు విశ్వసనీయ సమాచారం 

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)