Breaking News

కరెంట్‌ ఇచ్చే పార్కింగ్‌ షెడ్‌ 

Published on Sun, 08/13/2023 - 03:22

సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(ఐడీవోసీ–­కలెక్టరే­ట్‌)లో మొదటగా ఖమ్మంలో సోలార్‌షెడ్‌ ఏర్పాటు చేశారు. ఐడీవోసీలో 38కిపైగా శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా వారి వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి సౌకర్యం లేదు. దీంతో అధికారులు సోలార్‌ ప్యానళ్లతో కూడిన పార్కింగ్‌ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.1.78 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ఇప్పటికే పూర్తికాగా స్వాతంత్య్ర దినో­త్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించనున్నారు.

200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఈ సోలార్‌ ప్యానళ్ల ద్వారా రోజుకు 800 నుంచి వెయ్యి యూనిట్ల విద్యు­దుత్పత్తి అవుతోంది. ఈ మొత్తాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేసి కలెక్టరేట్‌ అవసరాలు పోగా మిగిలిన విద్యుత్‌కు మాత్రమే బిల్లు చెల్లించనున్నారు. సోలార్‌ షెడ్‌తో నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు విద్యుత్‌చార్జీలు ఆదా కావడమే కాక ఉద్యోగులకు చెందిన వందలాది వాహనాల పార్కింగ్‌కు సౌకర్యం కల్పించినట్లవుతోంది. సోలార్‌ ప్లాంట్‌తో ఐడీవోసీ భవనమంతా గ్రీన్‌ బిల్డింగ్‌గా మారనుంది. ఈవిధంగా రాష్ట్రంలోనే తొలి కలెక్టరేట్‌గా ఖమ్మం ఐడీవోసీ నిలుస్తోంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)