Breaking News

ప్రభుత్వ భవనాలపై సోలార్‌ ప్లాంట్లు

Published on Sun, 08/10/2025 - 05:07

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ భవనం నుంచి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ భవనాలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లో ఇందిరా పౌర గిరిజన వికాస పథకం అమలుపై శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సోలార్‌ విద్యుత్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.

అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, పార్కింగ్, క్యాంటీన్‌ ప్లాన్లు హైదరాబాద్‌కు పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని కలెక్టరేట్లన్నీ ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్‌ నుంచే పంపిస్తామని తెలిపారు. సోలార్‌ పవర్‌ ప్లాంట్లపై కలెక్టర్లు పంపాల్సిన వివరాలతో ఒక ప్రశ్నావళిని పంపిస్తున్నామని, అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారంలోపు విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.  

స్కూళ్లపై కూడా సోలార్‌ ప్లాంట్లు 
ప్రభుత్వ భవనాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, జూని యర్, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వివరా లు పంపాలని కలెక్టర్లను భట్టి విక్రమార్క ఆదేశించారు. నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖల పరిధిలో పెద్ద ఎత్తున ఉన్న ఖాళీ భూముల వివరాలు సైతం పంపాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం కింద పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల్లో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ఇవి ప్రారంభించామని, ఈ నెలలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)