Breaking News

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుతో పెళ్లి.. ఆరు నెలలకే టెకీ ఆత్మహత్య

Published on Fri, 06/20/2025 - 07:10

సాక్షి, హైదరాబాద్‌: అత్తింటివారి అదనపు కట్నం వేధింపుల కారణంగా పెళ్లయిన ఆరు నెలలకే ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య చేసుకుంది. హైటెక్‌ సిటీ వద్ద దుర్గం చెరువులో దూకి తనువు చాలించింది. ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్తతోపాటు అత్త, మామలు, మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల ప్రకారం.. ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని అడ్డగుట్టలో ఉంటున్న అంజయ్య, సుశీల దంపతుల కుమార్తె సుష్మ(27). ఈ ఏడాది జనవరి 31న సుష్మను నేరేడ్‌మెట్‌కు చెందిన అమృత్‌కు ఇచ్చి  వివాహం చేశారు. సుష్మ, ఆమె భర్త అమృత్‌ ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా చేస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, 6 తులాల బంగారం, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకు కట్నంగా కింద ఇచ్చారు. అయితే, పెళ్లి అయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కావాలంటూ భర్తతోపాటు అత్త, మామ, మరిది కలిసి సుష్మను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న సుష్మను ఈనెల 13న ఆసుపత్రిలో చేర్పించారు. 16న డిశ్చార్జి అయిన ఆమెను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ల్యాప్‌టాప్‌ తెచ్చుకునేందుకు సుష్మ తండ్రితో కలిసి అత్తగారింటికి వెళ్లింది.

ఈ సందర్భంగా భర్తతో సహా కుటుంబ సభ్యులు పరుషంగా మాట్లాడారు. మళ్లీ ఎందుకు వచ్చావంటూ సూటిపోటి మాటలు అనడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమె తండ్రి అంజయ్యను కూడా దూషించారు. దీంతో, సుష్మ మనస్తాపానికి గురైంది. బుధవారం మధ్యాహ్నం కంపెనీలో విధులకు వెళ్లింది. రాత్రి ఒంటి గంట వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి అంజయ్య కంపెనీ మేనేజర్‌కు ఫోన్‌ చేశాడు. రాత్రి 8.30 గంటల సమయంలోనే ఆమె బయటకు వెళ్లిందని చెప్పాడు.

అలా చెప్పడంతో కంగారు పడిన అంజయ్య.. తెలిసిన చోట గాలించి గురువారం తెల్లవారు జామున 4 గంటలకు మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 7.30 గంటల సమయంలో దుర్గం చెరువులో ఓ మహిళ శవం తేలిందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సుష్మ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)