Breaking News

సాఫ్ట్‌వేర్‌ దంపతుల ఆత్మహత్య

Published on Tue, 01/07/2025 - 00:38

పటాన్‌చెరు టౌన్‌: కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్‌ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు చెందిన సందీప్‌ (36)కు ఆరేళ్ల కిందట మంచిర్యాలకు చెందిన కీర్తి (34)తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటూ మియాపూర్‌లో ఉండేవారు. 9 నెలల కిందట అమీన్‌పూర్‌ పరిధిలోని బంధంకొమ్ము శ్రీదామ్‌ హిల్స్‌లో సొంతిల్లు కొనుగోలు చేసి కూతురు గగనహిత(3), కుమారుడు సాకేత్‌రామ్‌ (ఏడాదిన్నర)తో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. సోమవారం పాప గగనహిత పుట్టినరోజు ఉంది.

వేడుక జరిపే విషయంలో 5వ తేదీ (ఆదివారం) ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సందీప్‌ ఇద్దరు పిల్లల్ని తీసుకొని తల్లిగారింటికి మియాపూర్‌ వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కీర్తి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఒక్కడే ఇంటికొచ్చిన సందీప్‌కు కీర్తి ఉరేసుకొని కనిపించింది. వెంటనే అతడి తండ్రికి ఫోన్‌లో కీర్తి ఉరేసుకుందని విషయం చెప్పాడు. సందీప్‌ తల్లిదండ్రులు అక్కడికి వచ్చేలోపు అతడు కూడా తాడుతో ఉరేసుకున్నాడు. కీర్తి తండ్రి ప్రభాకర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీన్‌పూర్‌ సీఐ నాగరాజుతోపాటు ఎస్‌ఐ సోమేశ్వరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)