Breaking News

జూన్‌ 2 నుంచి రాష్ట్రమంతా స్లాట్‌ బుకింగ్‌

Published on Sun, 05/25/2025 - 00:38

సాక్షి, హైదరాబాద్‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా జూన్‌ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. స్లాట్‌బుకింగ్‌ విధానంపై శనివారం ఆయ న సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 47 కార్యాలయా ల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అమలు చేస్తుండగా, జూన్‌ 2 నుంచి అన్నిచోట్లా అమల్లోకి తెస్తున్నామని మంత్రి తెలిపా రు. స్లాట్‌బుకింగ్‌ ద్వారా ఇప్పటివరకు 36 వేలకు పైగా లావాదేవీలు జరిగాయని, ఈ విధానంపై 94% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్ల డించారు. 

ఉదయం 10:30 గంటల నుంచి మధ్యా హ్నం 1:30 గంటల మధ్య, తిరి గి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య స్లాట్‌ బుకింగ్‌కు అవకాశముంటుందని తెలి పారు. స్లాట్‌బుకింగ్‌ విధానం అమలవుతున్న దృష్ట్యా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పు నర్వ్యవస్థీకరణ జరుగుతోందని చెప్పారు. పని భారం ఎక్కు వగా ఉండే పటాన్‌చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల కార్యాలయాల్లో అదనపు సబ్‌రిజిస్ట్రార్‌తో పాటు సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు. 

భూ భా రతి తరహాలోనే ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ తయారు చేసి అందులో నిషేధిత భూములు, ఆస్తుల వివరాలను పొందుపరుస్తామని వెల్లడించారు. ఎక్కడ నిషేధిత భూమి రిజిస్ట్రేషన్‌ జరిగినా క్షణాల్లో ప్రధాన కా ర్యాలయానికి తెలిసేలా ఆన్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే అధికారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.  

నేడు జీపీఓ పరీక్ష : గ్రామ పాలనాధికారి (జీపీఓ) నియామకాలకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. దాదాపు 5 వేల మంది ఈ పరీక్షకు హాజరవుతారని, జేఎన్టీయూ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో వీఆర్వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్నవారిని వీలైనంత త్వరగా ఈ పోస్టుల్లో నియమిస్తామని వెల్లడించారు.  

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)