Breaking News

‘ప్రజాపాలన’లో నిర్లక్ష్యం వద్దు

Published on Thu, 12/28/2023 - 04:23

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం నుంచి వచ్చే నెల 6వరకు అమలు చేయనున్న ‘ప్రజాపాలన’కార్యక్రమాన్ని అధికారులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవ హారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రజా పాలన అమలు విషయంలో నిర్లక్ష్యం వద్దని రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో పాటు మిగతా శాఖల భాగస్వామ్యంతో పదిరోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. 

రేపు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలిస్తాం.. 
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను శుక్రవారం పరిశీలిస్తామని, వంతెన కుంగిన ఘటనను పరిశీలించి విచారణ చేపట్టి అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంథనిలోని కాళేశ్వరం ప్రాజెక్టు, హుస్నాబాద్‌లోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు. రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ హెచ్చరించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)