ఎక్స్‌టెన్షన్, పోస్టింగులు.. ఫోన్ల ట్యాపింగ్‌

Published on Wed, 01/28/2026 - 05:14

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో కేంద్రంగా చోటు చేసుకున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను విచారించింది. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిట్‌ కార్యాలయానికి వచ్చిన ఆయన రాత్రి 10.50 గంటలకు తిరిగి వెళ్లారు. ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. 

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, మరో కీలక నిందితుడు హైదరాబాద్‌ టాస్క్ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు సుదీర్ఘ కాలం ఆయా విభాగాల్లో పని చేశారు. పదవీ విరమణ తర్వాత కూడా ఎక్స్‌టెన్షన్‌ ద్వారా విధులు నిర్వర్తించారు. కాగా ఈ ఇద్దరు అధికారుల ఎక్స్‌టెన్షన్‌తో పాటు ఎస్‌ఐబీ, టాస్‌్కఫోర్స్‌ల్లో పని చేసిన మరికొందరి పోస్టింగుల వెనుక సంతోష్‌కుమార్‌ పాత్ర ఉన్నట్లుగా సిట్‌ అనుమానిస్తున్నట్లు తెలిసింది. 

ఈ కోణంలోనే కొన్ని కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆయా అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఎవరు తయారు చేయించారు? పోలీసు విభాగంతో పాటు హోం సెక్రటరీ ఆమోదం పొందేలా ఎవరు చేశారు? వీటిలో మీ పాత్ర ఏమిటంటూ ఆరా తీసినట్లు సిట్‌ వర్గాలు తెలిపాయి. అయితే ఆయా అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సంతోష్ కుమార్‌ చెప్పినట్లు సమాచారం.  

ఫోన్లు ట్యాప్‌ చేయించారనే కోణంలో.. 
మరోపక్క 2023లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సమయంలో కొన్ని ఫోన్‌ నంబర్లను ఎంపిక చేసిన సంతోష్ కుమార్‌ వాటిని ట్యాప్‌ చేయించడంతో పాటు నిఘా ఉంచినట్లుగా సిట్‌ అనుమానిస్తున్నట్లు తెలిసింది. ఈ అంశంపై విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సమగ్ర వాంగ్మూలం నమోదు చేసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సంతోష్‌కుమార్‌కు స్పష్టం చేసింది. 

ఇలావుండగా త్వరలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితకు కూడా సిట్‌ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. తనతో పాటు తన భర్త, కీలక అనుచరుల ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని ఆమె గతంలో పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెను విచారించాలని సిట్‌ భావిస్తోంది. 

మొక్కల పంపిణీకి యత్నం 
బంజారాహిల్స్‌: సిట్‌ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో.. పోలీసు అధికారులకు, పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చిన వారికి తన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఫౌండేషన్‌ తరఫున మొక్కలు పంపిణీ చేయాలని సంతోష్ కుమార్‌ భావించారు. దీంతో కార్యకర్తలు ఆటో నిండా పూల మొక్కలు తీసుకుని పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చారు. స్టేషన్‌కు కొద్ది దూరంలో మొక్కలు పంచేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆటోను సీజ్‌ చేశారు.   

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)