Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సిట్‌ చేతికి కీలక పెన్‌ డ్రైవ్‌

Published on Wed, 12/24/2025 - 11:32

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఒక పెన్‌ డ్రైవ్‌ కీలక ఆధారంగా మారింది. ఈ పెన్‌ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్‌ నెంబర్లను సిట్‌ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. దీంతో, పెన్‌ డ్రైవ్‌ ఆధారంగా ప్రభాకర్‌ రావును సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

వివరాల మేరకు.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పెన్ డ్రైవ్ చుట్టూనే ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ కొనసాగుతోంది. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విధుల్లో ఉన్న సమయంలోనే ఈ పెన్ డ్రైవ్‌లో ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన.. కీలక సమాచారం స్టోర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు నమోదై ఉన్నట్లు తేలింది. వీటిలో రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ప్రొఫైల్ వివరాలు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో, మరిన్ని వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నట్టు తెలిసింది.

ప్రస్తుతం ఈ పెన్ డ్రైవ్‌లోని డేటాను ప్రభాకర్ రావు ముందుంచి ఉంచి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక, ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నెంబర్లను గుర్తించడంలో ఈ డిజిటల్ ఆధారమే కీలకంగా మారిందని సిట్ భావిస్తోంది. ప్రభాకర్ రావు బృందం చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేసినప్పటికీ, ఈ ప్రెన్‌ డ్రైవ్‌ దొరకడం కేసులో కీలక ఆధారంగా మారింది. ఈ కేసును నిరూపించేందుకు పెన్‌ ప్రధాన ఆధారంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)