Breaking News

సింగరేణి కార్మికులకు రూ. 1726 కోట్లు.. ఒక్కొక్కరికి  2 నుంచి 6 లక్షలు

Published on Wed, 09/13/2023 - 10:17

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన బకాయిలపై సింగరేణి సంస్థ మంగళవారం కీలక ప్రకటన చేసింది. సింగరేణిలో జాతీయ బొగ్గు గనుల వేతన ఒప్పందం అమలు అవుతున్న విషయం తెలిసిందే. పదో వేజ్‌బోర్డు కాలపరిమితి  2021 జూలై 1తో ముగిసింది. అప్పటి నుంచి 11వ బోర్డు అమల్లోకి వచ్చింది.

ఈ మేరకు 2021 జూలై నుంచి 2023 మే 31 వరకు మొత్తం 22 నెలలకు సంబంధించి ఉద్యోగులు, కార్మికులకు పెరిగిన వేతన బకా యిలు చెల్లించాల్సి ఉంది. దీనిపై కార్మిక సంఘాలు క్రమం తప్పకుండా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో 11వ వేజ్‌బోర్డు వేతన బకాయిలు ఈనెల 21న చెల్లిస్తామని సింగరేణి ప్రకటించింది. ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో పని చేస్తున్న 42 వేల మందికి పైగా ఉన్న ఉద్యోగులు, కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ బకాయిల మొత్తం జమచేస్తారు. ఇందుకు సంస్థ  రూ.1,720 కోట్లు కేటాయించింది. 

కనిష్టంగా రూ.2.60 లక్షలు
సింగరేణిలో ప్రారంభ వేతనం పదో వేజ్‌బో ర్డులో రూ. 25,000 ఉండగా 11వ వేజ్‌బోర్డ్‌లో ఇది రూ. 37,000కు చేరుకుంది. సీనియర్‌ విభాగంలో గరిష్ట వేతనం రూ.76వేల నుంచి రూ.90 వేలకు పైగా చేరుకుంది. దీంతో ఒక్కో కార్మికుడు పొందే వేతనాల బకాయిల మొత్తం కనిష్టంగా రూ. 2.64 లక్షలు ఉండగా,  గరిష్టంగా రూ.3.08 లక్షల వరకు ఉంటుంది. ఇక ఉద్యోగుల విషయంలో గరిష్టంగా రూ.6 లక్షల వరకు వేతన బకాయిలు అందనున్నాయి.
చదవండి: జమిలీ ఎన్నికలపై గుత్తా సుఖేందర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు