Breaking News

ఎన్‌ఎండీసీ క్రికెట్‌ ట్రోఫీ ఫైనల్‌కు సింగరేణి జట్టు 

Published on Mon, 07/31/2023 - 03:04

నాంపల్లి: ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు తలపడుతున్న ప్రతిష్టాత్మక ఎన్‌ఎండీసీ క్రికెట్‌ టోర్న్ లో సింగరేణి కాలరీస్‌ జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.  హైదరాబాద్‌లోని విజయ్‌ ఆనంద్‌ క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో సింగరేణి జట్టు హిందుస్తాన్‌ ఏరో నాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) జట్టుతో తలపడింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హెచ్‌ఏఎల్‌ జట్టు నిర్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెచ్‌ఏఎల్‌ జట్టు ఓపెనర్‌ సందీప్‌కుమార్‌ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. సింగరేణి జట్టు బౌలర్లు జగదీష్‌ (2 వికెట్లు), మహేష్‌ (2 వికెట్లు), హరికిషన్‌ (ఒక వికెట్‌)లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేసి హెచ్‌ఏఎల్‌ జట్టును తక్కువ స్కోర్‌కు పరిమితమ్యేలా చేయడంలో సఫలమయ్యారు.  

ఆ తర్వాత 109 పరుగుల లక్ష్య సాధనతో బరిలోకి దిగిన సింగరేణి జట్టు ఓపెనర్లు శశికాంత్, డేవిడ్, రిచర్డ్స్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేశారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటమే కాకుండా తొలి వికెట్‌కు కేవలం 9 ఓవర్లలో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 47 పరుగుల వద్ద డేవిడ్‌ రిచర్డ్స్‌ అవుట్‌ అయ్యాక.. జట్టు కెపె్టన్‌ శశికాంత్‌ నిలకడగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. డేవిడ్‌ రిచర్డ్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ టోరీ్నలో సింగరేణి జట్టు లీగ్‌ దశలో తాను ఆడిన ఈసీఐఎల్, మిథాని, ఎన్‌ఆర్‌ఎస్‌ఈ జట్లను ఓడించి ఓటమి లేని జట్టుగా నిలిచింది. ఆగస్టు 6న ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ భెల్‌తో తలపడనుంది.  

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)