Breaking News

రాజస్తాన్‌లో సింగరేణి సోలార్‌ ప్లాంట్‌

Published on Fri, 07/05/2024 - 04:27

గోదావరిఖని (రామగుండం): రాజస్తాన్‌లో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సింగరేణి సన్నా హాలు చేస్తోంది. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్‌.బలరాం గురువారం రాజస్తాన్‌ రాజధా ని జైపూర్‌లో విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో సమావేశ మయ్యారు. ఆ రాష్ట్ర ఇంధన శాఖ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ, ట్రాన్స్‌కో సీఎండీ అలోక్‌ను కలిశారు. సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకువస్తే రాజస్తాన్‌ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని అలోక్‌ తెలిపినట్లు వెల్లడించారు. 

అనంతరం రాజస్తాన్‌ జెన్‌కో సీఎండీ దేవేంద్రశ్రింగి, రెన్యూ­వబుల్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ నథ్‌మల్, డిస్కమ్స్‌ చైర్మన్‌ భానుప్రకాశ్‌ ఏటూరును కలిసి ప్లాంట్‌ ఏర్పాటు, తర్వాత విద్యుత్‌ కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సంస్థ చైర్మన్‌ బల­రాం.. రాజస్తాన్‌ ఉన్నతాధికారులకు వివరించారు. 

సోలార్‌ పార్కులో సింగరేణి ప్లాంట్‌కు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించిన తర్వాత పూర్తి ప్రతిపాదనలతో మరోసారి సమావేశం అవుతామని బలరాం తెలిపారు. సీఎండీ వెంట డైరెక్టర్‌ సత్యనారాయణరావు, సోలా ర్‌ ఎనర్జీ జీఎం జానకీరాం, చీఫ్‌ ఆఫ్‌ పవర్‌ విశ్వనాథరాజు ఉన్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)