Breaking News

ఇండస్ట్రియల్, అగ్రికల్చర్‌ హబ్‌గా సిద్దిపేట: హరీశ్‌

Published on Sat, 02/25/2023 - 00:59

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో నెలకొల్పిన శిక్షణ కేంద్రాలను యువత సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులపై గురుతర బా­ధ్యత ఉందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్‌ పాల్గొన్నా­రు.  యూనియన్‌ గ్రామీణ స్వ­యం ఉపాధి శిక్షణ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు యూనియన్‌ బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సూర్యచంద్ర తేజతో కలసి శంకుస్థాపన చేశారు.

హరీశ్‌ మాట్లాడుతూ సిద్దిపేట ఇండస్ట్రియల్, అగ్రికల్చర్‌ హబ్‌గా మారిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా కాళేశ్వరం ద్వారా గోదా­వరి నీటి వసతి వచ్చిందని తెలిపారు. త్వరలో రైల్వే సౌకర్యం రానుందని, ప్రముఖ కోకాకోలా కంపెనీ కొండపోచమ్మ సాగర్‌ వద్ద భారీ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పా టు చేయనుందని హరీశ్‌ వెల్లడించారు.  దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రైస్‌ మిల్లు వర్గల్‌లో రానుందన్నారు. బెజ్జంకి దాచా రం వద్ద భారీ గ్రానైట్‌ హబ్‌ వస్తుందని తెలిపారు. కాగా, పొ­న్నా­ల వద్ద నిర్మించిన ప్లైఓవర్‌ బ్రిడ్జిని హరీశ్‌ ప్రారంభించి బుల్లెట్‌ బండిపై బ్రిడ్జి మీ­దుగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)