Breaking News

Hyderabad: బ్రిడ్జి కింద నగ్నంగా మహిళ మృతదేహం..!

Published on Wed, 09/17/2025 - 08:20

రాజేంద్రనగర్‌: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్‌ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం..కిస్మత్‌పూర్‌ బ్రిడ్జి పక్కనే ఉన్న కల్లు కంపౌండ్‌ సమీపంలోని పొదల్లో ఓ మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా పడి ఉంది. సంఘటన జరిగి రెండు, మూడు రోజులు కావస్తుండటంతో పాటు రెండు రోజులుగా వర్షాలు పడటంతో మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. 

క్లూస్‌ టీమ్, డాగ్స్‌ టీమ్‌ను రప్పించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహనికి కొద్ది దూరంలో నల్లటి స్క్రాప్, నల్లటి పైజామా కనిపించింది. మృతురాలు వయస్సు 25–30 సంవత్సరాలు ఉంటుందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. మహిళను ఇక్కడికి తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడి చంపారా..లేదా ఇతర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారా అన్నది దర్యాప్తులో తేలనుందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు. మృతురాలికి సంబంధించిన ఫోటోలను అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించామన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిస్తే రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించాలన్నారు.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)