Breaking News

కామపిశాచికి ఎమ్మెల్యే టికెట్‌ ఎలా ఇస్తారు?: శేజల్ సంచలన ఆరోపణలు

Published on Tue, 08/22/2023 - 14:20

సాక్షి, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యే  టికెట్‌ను మరోసారి దుర్గం‌ చిన్నయ్యకు కేటాయించడంపై శేజల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‌కామా పిశాచికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్‌ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కామ పిశాచి, చీటర్‌కు లైసెన్స్ ఇచ్చి నీకు అడ్డులేదు రెచ్చిపో, ఇష్టమొచ్చిన అమ్మాయిని వేధించు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని మండిపడ్డారు.

కాగా  బీఆర్ఎస్ పార్టీ సోమవారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో దుర్గం చిన్నయ్య పేరు ఉండడంపై బాధితురాలు శేజల్ తీవ్రంగా స్పందించారు. .తాను  ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవలేదని వాపోయారు. దుర్గం చిన్నయ్య భవిష్యత్తులో మహిళలను వేధించకుండా ఉంటారని గ్యారంటీ ఎంటని ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది అమ్మాయిలు ‌ ఎమ్మెల్యే అరాచకాలకు బలికావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇష్టం వచ్చినట్లు దోచుకోవాలని, అమ్మాయిలను వేధించాలని దుర్గం చిన్నయ్యకు టికెట్‌ ఇచ్చారంటూ శేజల్‌ మండిపడ్డారు. దీనిపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా దుర్గం చిన్నయ్య చేసిన తప్పులపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే చేసిన లైంగిక వేధింపులు, అక్రమాలు, భూకబ్జాలపై బెల్లంపల్లిలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తానని.. దుర్గం చిన్నయ్య ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్‌ విసిరారు.
చదవండి: సీఎం కేసీఆర్‌ మమ్మల్ని అవసరానికి వాడుకున్నారు: కూనంనేని

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)