Breaking News

మహిళా మేలుకో.. ‘షీబాక్స్‌’కు చెప్పుకో!

Published on Sat, 03/07/2026 - 06:09

సాక్షి, హైదరాబాద్‌: మహిళా భద్రత కోసం అందుబాటులో ఉన్న మరో అస్త్రం షీ–బాక్స్‌. పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులను అరికట్టే లక్ష్యంతో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించిన ఆన్‌లైన్‌ పోర్టలే ఈ షీ–బాక్స్‌ (సెక్స్‌వల్‌ హెరాసె్మంట్‌ ఎల్రక్టానిక్‌ బాక్స్‌). దేశంలో ఎక్కడ పనిచేసే మహిళలైనా, ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేలా దీన్ని రూపొందించారు.కాగా, 2024, ఆగస్టు 29న ఈ పోర్టల్‌ను మరింతగా ఆధునీకరించారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతూనే, నిందితులను శిక్షించేలా ఇందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది.

ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవస్థీకృత లేదా అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే మహిళలెవరైనా లైంగిక వేధింపులపై ఈ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దేశంలో కార్యాలయాల్లో మహిళలపై వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో, బాధితులు భయపడకుండా నేరుగా ఫిర్యాదు చేయడానికి ఈ వ్యవస్థను రూపొందించారు. 2013లో అమల్లోకి వచి్చన పోష్‌ యాక్ట్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ సెక్సువల్‌ హెరాసె్మంట్‌)ను సక్రమంగా అమలు చేయడంలో ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

బాధితులు బయటికి రావాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేయడంతోపాటు వారి ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు పురోగతిని ట్రాక్‌ చేసే వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతీ సంస్థ ఇంటర్నల్‌ కంప్లైట్స్‌ కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు ఆ వివరాలను షీ–బాక్స్‌ పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి. కాగా, అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పోర్టల్‌లో ఫిబ్రవరి వరకు 1,008 ఫిర్యాదులు నమోదవగా, అందులో 105 ఫిర్యాదులు పరిష్కరించారు.  

షీ–బాక్స్‌ అంటే ఏమిటి? 
షీ–బాక్స్‌ అనేది మహిళలు ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన డిజిటల్‌ ప్లాట్‌ఫాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే మహిళలు ఈ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.  

ఎలా ఫిర్యాదు చేయాలి? 
⇒ షీ–బాక్స్‌ పోర్టల్‌  https:// shebox.wcd. gov. in/ లోకి వెళ్లాలి.  
⇒ కుడిచేతి వైపు ఉన్న రిజిస్టర్‌ యువర్‌ కంప్లైంట్‌పై క్లిక్‌ చేయాలి.  

⇒ అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేయాలి.  
⇒ అవసరమైతే ఆధారాలు అప్‌లోడ్‌ చేయాలి.  

⇒ ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత అది సంబంధిత సంస్థలోని ఇంటర్నల్‌ కంప్లైంట్స్‌ కమిటీ (ఐసీ సీ) లేదా సంబంధిత అధికారులకు పంపిస్తారు. 
ఫిర్యాదు చేసిన తర్వాత ఏమవుతుంది? 
⇒ ఫిర్యాదు సంబంధిత శాఖకు, ప్రైవేటు కార్యాల యం అయితే సంబంధిత కార్యాలయంలోని ఇంటర్నల్‌ కంప్లైంట్స్‌ కమిటీకి లేదా జిల్లా స్థాయి లోని లోకల్‌ కమిటీ (ఎల్‌సీ)కి పంపిస్తారు. 

⇒ అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 
⇒ విచారణ ప్రారంభమైన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.  
⇒ బాధితురాలికి ఫిర్యాదు స్థితి గురించి సమాచారం అందుతుంది. పోర్టల్‌లోకి వెళ్లి తమ ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు పురోగతిని ట్రాక్‌ చేసే వీలుంటుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)