Breaking News

ప్రజాభవన్ యాక్సిడెంట్‌ కేసులో కీలక మలుపు

Published on Wed, 01/17/2024 - 11:34

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాభవన్(పాత ప్రగతి భవన్‌) ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. తన కొడుకు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ దుబాయ్‌కు పారిపోయేందుకు షకీల్‌ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.

రోడ్డు ప్రమాద ఘటన తర్వాత..  సాహిల్‌ దుబాయ్‌ పారిపోయేందుకు మొత్తం పది ముంది సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. అందులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇందులో షకీల్‌ కూడా తన కొడుకు కోసం సహకరించినట్లు గుర్తించారు.  ఇక.. ఇప్పటికే సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌పై లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతన్ని దుబాయ్‌ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రజా భవన్‌ ముందు సాహిల్‌ గత నెల 23వ తేదీన కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌తో ప్రజాభవన్‌ ఎదుట బారీకేడ్లను తన కారుతో ఢీకొట్టాడు. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక.. కారు ప్రమాద విజువల్స్‌ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన పోలీస్‌ సిబ్బందిపైనా వేటు వేశారు.

ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు కేసులో హై కోర్టు కీలక తీర్పు

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు