Breaking News

కేసు మూసేసినా ధన దాహం తీరలేదు!

Published on Sat, 01/25/2025 - 09:02

సాక్షి,  హైదరాబాద్‌: ఆత్మహత్యగా తేలిన మిస్సింగ్‌ కేసులో అనుమానితుడి నుంచి లంచం డిమాండ్‌ చేసిన కేసులో షాహినాయత్‌గంజ్‌ ఠాణా మాజీ ఇన్‌స్పెక్టర్‌ బాలు చౌహాన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ కేసు క్లోజ్‌ అయినా ధనదాహం తీరని ఇన్‌స్పెక్టర్‌ వేధించడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం కొసమెరుపు. షాహినాయత్‌గంజ్‌ ఠాణా పరిధిలో నివసించే ఓ వ్యక్తి అప్పుల బాధతో గత నెల 5న అదృశ్యమయ్యాడు. దీనిపై గత నెల 7న కుటుంబీకుల ఫిర్యాదుతో షాహినాయత్‌గంజ్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఈ కేసు కొలిక్కిరాకుండానే గత నెల 11న అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆ వ్యక్తి మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. అప్పు ఇచి్చన వారి వేధింపుల కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణాలో నమోదైన కేసులు షాహినాయత్‌గంజ్‌ ఠాణాకు బదిలీ చేయించుకుంటారు. అయితే బాలు చౌహాన్‌ మాత్రం ఆ కేసును అక్కడే ఉంచి.. ఇక్కడ నమోదైన మిస్సింగ్‌ కేసును గత నెల 19న క్లోజ్‌ చేశారు. 

ఆ కేసులో అనుమానితులుగా ఉన్న అప్పు ఇచ్చిన వ్యక్తులను పిలిచి నిందితులుగా చేరుస్తానంటూ బెదిరించాడు. ఓ వ్యక్తిని మాత్రం తీవ్రంగా హెచ్చరించిన బాలు చౌహాన్‌ అలా కాకుండా ఉండాలంటే తనకు రూ.1.5 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గత నెల 23, 24 తేదీల్లో చౌహాన్‌ వేధింపులు ఎక్కువ కావడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు ఇన్‌స్పెక్టర్‌ను కలిసి, అతడితో రూ.50 వేలకు బేరసారాలు చేసి, ఆ మొత్తం తతంగాన్ని ఆడియో రికార్డు చేశాడు. 

ఈ సాక్ష్యాన్ని ఏసీబీ అధికారులకు అందించాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసు ఉన్నతాధికారులు బాలు చౌహాన్‌పై ఈ నెల 3న బదిలీ వేటు వేశారు. దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి ఏసీబీ అధికారులు శుక్రవారం అతడిని అరెస్టు చేశారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)