Breaking News

‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’

Published on Thu, 04/17/2025 - 21:25

హైదరాబాద్:  కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డు బిల్లుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మీద ముస్లింలకు నమ్మకం ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ‘వక్ఫ్ బోర్డ్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డ్ బిల్లును మేము సుప్రీంకోర్టులో  చాలెంజ్ చేశాం. మా తరఫున కపిల్ సిబాల్ వాదించారు. కేవలం ఒక మతానికి మాత్రమే చట్టం ఎలా చేస్తారు?. వక్ఫ్ భూములు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కావు...దాతలు ఇచ్చిన భూములు పేద ముస్లింలకు చెందాలని ఇచ్చారు. వక్ఫ్ బోర్డు లో మహిళలు ఉన్నారు

తెలంగాణలో,ఏపీలో మహిళలు కూడా ఉన్నారు. అన్ని మతాల దేవాలయాల భూములు కబ్జా చేస్తున్నారు. అన్నిటికీ చట్టం తీసుకొని రావాలి.... అప్పుడు స్వాగతిస్తం. వేరే వేరే మతాల వారిని బోర్డులో నియమించడం వల్ల గొడవలు జరుగుతాయి’ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

కాగా, వక్ఫ్‌ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.

వక్ఫ్‌ (సవరణ) చట్టం 2025ను సవాల్‌ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది.  కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)